అన్వేషించండి

Weekly Horoscope 4-10 September: ఈ వారం ఈ రాశులవారికి లక్కు కలిసొస్తుంది - సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు

సెప్టెంబరు 4 నుంచి 10 వరకూ ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

Weekly Horoscope 4-10 September: ఈ వారం రాశిఫలాలు

మేష రాశి

మేషరాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటారు. గతవారం ఎదుర్కొన్న ఇబ్బందులు కొంతవరకూ తీరిపోతాయి. పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. అప్పులు చేయాలనే ఆలోచన మానుకోవడం మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి కాకుండా వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలి. ఓవరాల్ గా చెప్పాలంటే ధైర్యంగా వ్యవహరించాల్సిన వారం ఇది. ప్రస్తుతం ప్రతిదీ మీకు అనుకూలంగా మారడానికి సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

వృషభ రాశి

ఈ వారం ఈ రాశివారు తమను తాము చాలా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆలోచనాత్మకంగా చేయండి. అనవసర వాగ్ధానాలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ వారం పెద్ద పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. చేపట్టిన పనిలో అప్రమత్తంగా ఉంటే చాలు..పెద్దగా వచ్చే అడ్డంకులేమీ లేవు. 

మిథున రాశి

ఈ వారం మీ కుటుంబంలో సామరస్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యం నిర్వహణకు ప్లాన్ చేస్తారు. కొంత దూరమయ్యే పరిస్థితి కనిపించినా, ఆత్మీయులతో కలవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. పెద్దగా కష్టాలు లేవు కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం బాగానే ఉంటుంది.

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

కర్కాటక రాశి

ఈ వారం మీకు మానసికంగా గందరగోళంగా ఉంటుంది. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహా తీసుకున్న తర్వాతే కొత్త పనిని ప్రారంభించండి.  అందరినీ నమ్మవద్దు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ముఖ్యంగా స్త్రీలతో సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టేతే ఈ వారం మీ పనులు పూర్తవుతాయి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉంది..వివాదాలు జరిగే అవకాశం ఉంది. 

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారం ప్రేమ ప్రతిపాదన రావొచ్చు..వివాహం దిశగా వెళుతుంది. జీవితంలో ముందడుగు వేసే శుభసూచనలు కనిపిస్తాయి. ఇంట్లో, కార్యాలయంలో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా కుటుంబంలో చిన్న పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. 

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. ఈ వారం మీరు ఓ చెడువార్త వినే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  ఖర్చులు నియంత్రించలేరు కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కుటుంబంలో, కార్యాలయంలో మీకు అందరి సహకారం లభిస్తుంది. 

తులా రాశి

ఈ వారం తులారాశి వారికి శుభసమయం. ఈ వారం ప్రయాణాలు, విందులు, వినోదాలలో బిజీగా ఉంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. జీవితం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యంలో కొంత ఇబ్బంది కనిపిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అతివిశ్వాసం తగ్గించుకోవడం మంచిది. తొందరపడి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది.

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

వృశ్చిక రాశి

ఈ వారం మీరు గందరగోళ పరిస్థితిలో ఉంటారు. ఒకే సమయంలో అవకాశాలు చుట్టుముడతాయి..నిర్ణయం తీసుకోనడం మీకు కొంచెం కష్టతరమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. రహస్య శత్రువల పట్ల జాగ్రత్త వహించాలి.

ధనుస్సు రాశి

ఈ వారం ఈ రాశివారు బంధువులను, కొందరు తెలియని వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ప్రేమ విషయంలో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు.  వైవాహిక జీవితం బావుంటుంది.  భౌతిక సుఖాల కోసం ఖర్చు  చేస్తారు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో సమయం , వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
ఈ వారం మకర రాశి వారికి కొంత బిజీగా ఉంటుంది. మీరు ఒకేసారి అనేక రకాల పనులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఏర్పరచుకుంటే మానసిక ఒత్తిడి ఉండదు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు, అమ్మకానికి సంబంధించి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రేమికుల మధ్య పరస్పర వివాదాలు ఉండొచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ వారం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది .

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా విజయవంతమవుతుంది. గతవారం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అనుకోకుండా వస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత పనులకు కూడా వారం మంచిది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, విస్తరించాలనుకున్నా కచ్చితంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు తమ యజమానితో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఓపికతో పని చేస్తే అంతా సవ్యంగానే సాగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. 

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి! 

మీన రాశి

మీనరాశివారికి ఇది ఉత్తమమైన వారం. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక ప్రగతి వైపు పయనిస్తారు. కుటుంబ సమేతంగా శుభకార్యాలకు వెళతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు పని విషయంలో ప్రయాణాలు చేస్తారు. మీ విజయం గురించి మీ మనస్సులో ఎలాంటి సందేహం ఉంచుకోవద్దు. అనుకున్న పని సమయానికి జరగకపోతే కోపం తెచ్చుకోవద్దు. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget