అన్వేషించండి

Monthly Horoscopes September 2023: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ సెప్టెంబరు నెల రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Monthly Horoscopes September 2023: సెప్టెంబరు నెలలో కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి
మేష రాశి వారికి సెప్టెంబరు నెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులతో పాటూ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ నెలలో పూర్తవుతాయి. ఇంటా-బయటా మీ మాటే నెగ్గుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భారీ ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలు వేసుకోవడం మంచిది. స్నేహితుల కారణంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

వృషభ రాశి
వృషభ రాశివారికి కూడా సెప్టెంబరు నెల పూర్తి అనుకూల ఫలితాలున్నాయి. అన్నింటా జయం, ఆదాయం బావుంటుంది. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు కదులుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోపోవద్దు. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.

మిథున రాశి
ఈ నెలలో ఈ రాశివారికి ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రాశికి చెందిన అన్ని రంగాలవారికీ సమయం కలిసొస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది.

Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట

కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ నెల అద్భుతంగా ఉంది. ఉద్యోగులు అన్నీ సానుకూల ఫలితాలే పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి అవుతుంది. ఈ నెల వ్యాపారులకు లాభాలతో నిండి ఉంటుంది. మీరు ఏదైనా భాగస్వామ్య పనిలో నిమగ్నమై ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. నెలాఖరులో మీరు ఆర్థిక లాభం పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులను, ప్రముఖులను కలుస్తారు.

సింహ రాశి 
సింహ రాశివారికి ఈ నెల గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు కష్టానికి తగినవిధంగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.  జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూసే ఉద్యోగులకు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. దైవ సంబంధిత కార్యక్రమాలు చేస్తారు

Also Read: పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు

కన్యా రాశి
కన్యా రాశివారికి సెప్టెంబరు నెలలో సమయం అంత అనుకూలం అనిపించడం లేదు. ముఖ్యంగా మాటపై సంయమనం పాటించడం మంచిది లేదంటే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి లేదంటే ఈ సమయంలో మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. వ్యాపారులు  అప్రమత్తంగా ఉండకపోతే ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఈ నెల మీకు చాలా సవాళ్లు తెచ్చి పెడుతుంది. పూర్తి కావాల్సిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కుటుంబంలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలున్నాయి జాగ్రత్త.

తులా రాశి
తులా రాశివారికి సెప్టెంబరు నెల అద్భుతంగా ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. తలెపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు.స్థిరాస్థి వృద్ధి చేస్తారు. ధనలాభం పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి సంపూర్ణ సహకారం మీకుంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎళాంటి వాగ్ధానాలు చేయకపోవడమే మంచిది. జీవితం సంతోషంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి
సెప్టెంబరు నెల వృశ్చికరాశివారికి శుభఫలితాలను అందిస్తోంది. ఈ నెలలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.  అన్నింటా జయం, ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు మొగ్గుచూపుతారు. వాహన లాభం ఉంటుంది.  చిన్న చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో వాదనలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. డబ్బు ఆదా చేయడంలో సక్సెస్ అవుతారు.

ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలనిస్తోంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తే నెలాఖరులోగా స్థిరమైన ఉద్యోగం సాధిస్తారు. భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కానీ డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. బంధువర్గంలో ఉండే సమస్యలు మీరు పరిష్కరిస్తారు.

మకర రాశి
ఈ నెలలో గ్రహసంచారం మీకు కొంత అనకూలంగానే ఉంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి లేదంటే సమస్యలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఆర్థిక సంబంధిత విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఓ గొప్ప అవకాశం చేజారి పోవచ్చు జాగ్రత్త పడడండి. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి మాటలు తూలొద్దు. ఉద్యోగులు ఉన్నతాధికారులపై మాట తూలొద్దు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. గడిచిన నెలలో వెంటాడిన సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభ రాశి
కుంభ రాశివారు సెప్టెంబరు నెలలో జాగ్రత్తగా ఉండాలి. తలపెట్టిన పనిలో ఆశించిన ఫలితాలు పొందడం కాస్త కష్టమే. ప్రణాళికలు మార్చుకుని ముందుకు వెళితే సక్సెస్ అవుతారు. కుటుంబంలో ఉన్న గొడవలు సమసిపోతాయి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ధైర్యంగా అడుగేస్తేనే సక్సెస్ అవుతారు. కుటుంబంలో ఉన్న వివాదాలు ముగుస్తాయి. భూ సంబంధిత వ్యవాహారాలు పెద్దగా అనుకూలించవు.

Also Read: లోకంలో మనుషులంతా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోరూ!

మీన రాశి
మీన రాశివారికి సెప్టెంబరు నెల మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ నెల శుభసమయం. ఆర్థిక ఇబ్బందులున్నా సమయానికి డబ్బు చేతికందుతుంది. కోపం, తొందరపాటుతనం తగ్గించుకుంటే మంచిది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో తగాదాలకు దూరంగా ఉండాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget