పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు! మహాభారతంలో ఉన్న ఆ రహస్యం ఏంటి?
Weather: పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ధం వస్తుంది. ఈ శబ్ధం విని ఎరైనా భయపడితే అర్జునా, ఫల్గుణా అంటూ వరసగా పదినామాలు జపిస్తారు. పిడుగులకు అర్జునుడిని జపించడానికి ఏంటి సంబంధం

Mahabharat
అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా?
అర్జునుడిని తలుచుకుంటే భయం పారిపోతుందా?
అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం?
మహాభారతంలో దీనికి సంబంధించి ఏముంది?
అర్జునుడి పేర్లు వరుసగా ఎందుకు తల్చుకోవాలి? వాటి వెనుకున్న అర్థమైంటి?
ఇదంతా అర్థంకావాలంటే మహాభారతంలో ఓ సందర్భాన్ని చెప్పుకోవాలి....
అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా
బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః “
ఇవన్నీ అర్జునుడి బిరుదులే. ఇవి పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతం లో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది.
పాండవులు అరణ్యవాసం పూర్తైన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు. విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు. అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి..శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.
అప్పటికే పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు. అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి.. ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.
గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారు
ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అని పిలుస్తారు
దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారు
కుంతీ దేవి అసలు పేరు పృథ.. ఆమెకు జన్మించడం వలన పార్ధుడు అయ్యాడు
ఉత్తర ఫల్గునీ నక్షత్రం - పూర్వ పాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి అక్కడున్నవారి భయం పోగొడతాడు.
ఫాల్గుణ నామం వెనుక ఉన్న అర్థం ఇదే. ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు.
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















