పారిజాతం పూజకే కాదు ఆరోగ్యానికి కూడా



పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి నీటితో కలిపి తలకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి



పారిజాత చూర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకుని తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది



పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదంలో కలిపి, సన్నని సెగపై వేడి చేసి వాతపు నొప్పులు ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది



పారిజాతం ఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది



పారిజాతం ఆకులను మెత్తగారుబ్బి రసాన్ని తీసి సన్నని సెగపై సగం అయ్యే వరకు వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. సయాటికా నొప్పి తగ్గిపోతుంది



గజ్జి, తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండపెంకుల్లో మాడ్చి మసిగా చేసి కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది.



ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి పారిజాతం నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మెదడులోని సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.



పారిజాత ఆకులను కషాయంగా చేసుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయి.



అందుకే ఎక్కువగా పారిజాత మొక్క ను ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు.



Images Credit: Pixabay