ఆయిల్ పుల్లింగ్ అనేది పరగడుపున చేసే ఆయుర్వేద సంప్రదాయం అని చెప్పుకోవచ్చు.

ఆయిల్ పుల్లింగ్ కోసం కొద్దిగా వంట నూనెను పుక్కిట పట్టి 10-15 నిమిషాల పాటు పుక్కిలించాలి.

ఆయిల్ పుల్లింగ్ తో నోటి ఆరోగ్యం బావుటుంది. శరీరం నుంచి విషపదార్థాలు బయటకు పోతాయి.

ఈ ప్రక్రియ ఉదయం పళ్లు తోముకోవడానికి ముందే చెయ్యాలి.

ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించవచ్చు.

పరగడుపున ఒకటిరెండు స్పూన్ల నూనె 15 నిమిషాలు పుక్కిలించి, ఆ తర్వాత బ్రష్ చేయాలి.

ఆయిల్ పుల్లింగ్ వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి.

నోటి దుర్వాసన నుంచి విముక్తి దొరుకుతుంది.

దంతక్షయాన్ని నివారించవచ్చు. చిగుళ్లలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

మైగ్రేన్, అస్తమా, ఒత్తిడి వంటి వాటికి మంచి చికిత్స కూడా

Representational image:Pexels, pixabay