పిల్లలకు ఎలాంటి సమస్య లేకపోయినా సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి. పిల్లలకు కంటి అద్దాలు అవసరమైతే వాటిని శ్రద్ధగా ఉపయోగించేట్టు చూడాలి. అద్దాలు వాడుతున్న పిల్లల అద్దాల పవర్ ప్రతి 6-8 నెలలకు ఒకసారి పరీక్షించి చూసుకోవాలి. పిల్లలకు తాజా కూరగాయలు, పండ్లు తినడం అలవాటు చేయండి. డిజిటల్ స్క్రీన్ టైమ్ పిల్లలకు కచ్చితంగా పరిమితుల్లో ఉండేట్టు జాగ్రత్త పడాలి. స్క్రీన్ కి కంటికి మధ్య కనీసం 18-24 అంగుళాల దూరం ఉండేట్టు చూడాలి. చదువుకొనే సమయంలో గదిలో వెలుతురు సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కళ్లు హైడ్రేటెడ్ గా ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లల కంటి నుంచి నీళ్లు కారడం, తలనొప్పి, చూపులో అస్పష్టత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. Representational image: Pexels