ఆవు పాలు తాగడం ఆరోగ్యకరం. అయితే స్కీమ్డ్ మిల్క్ తాగడం మంచిది. ఆవు పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలం. ఎముకల బలానికి చాలా అవసరం. లాక్టోజ్ ఇన్ టాలెరెన్స్ లేని వారికి ఆవు పాలు తాగడం ఆరోగ్యకరం. కొంత మందిలో లాక్టోజ్ ఇన్టాలెరెన్స్, ప్రొటీన్ అలెర్జీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి చర్మం మీద దురద, మలబద్ధకం, తుమ్ములు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుల్ మిల్క్ క్రీమ్ తప్పనిసరిగా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే పాలలో ఉండేది సంతృప్త కొవ్వులే. ఆవు పాలలో ఐరన్ ఉండదు కనుక పిల్లలకు మంచిది కాదట. కొంత మంది పిల్లలకు ఇవి సరిపడవట. అయితే కొంత మందికి ఈ పాలు బాగా సరిపడతాయి. అలాంటి వారికి ఈ పాలు మేలు చేస్తాయి. మొత్తానికి ఆవు పాలలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజ లవణాలు అందుతాయి. Representational image:Pexels