వాసెక్టమీ చేయించుకుంటే ఆ సామర్థ్యం తగ్గిపోతుందా? మగవారికి చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వాసెక్టమీ. ఇప్పటికీ కూడా వాసెక్టమీ చేయించుకోవడానికి ముందుకు వచ్చే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాసెక్టమీ అనేది ఒక చిన్న సర్జరీ. పురుషుల వృషణాల్లో వీర్యాన్ని మోసుకెళ్ళే నాళాలు ఉంటాయి. వాసెక్టమీలో ఒక నాళాన్ని కట్ చేస్తారు. దీని వల్ల వీర్యంలో వీర్యకణాలు కలవవు. ఈ ఆపరేషన్ 99 శాతం సక్సెస్ అవుతుంది. వాసెక్టమీ వల్ల తమ లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని కొంతమంది మగవారు భావిస్తూ ఉంటారు. వాసెక్టమీకి, లైంగిక శక్తికి తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు వైద్యులు. వీర్యకణాలు ఎప్పటిలాగానే ఉత్పత్తి అవుతూనే ఉంటాయి కాబట్టి లైంగికాసక్తి తగ్గద్దు. ఈ ఆపరేషన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. కాబట్టి మగవారు వాసెక్టమీ చేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దు.