తల్లిపాలు పిల్లలకు ఎప్పుడు మాన్పించాలి?



ఎప్పుడు తల్లిపాలు మానిపిస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందో వైద్యులు వివరిస్తున్నారు.



చంటి పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చాక బయటి ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టాలి.



ఉడకబెట్టిన క్యారెట్, ఆపిల్, రాగి జావ, అన్నం జావ వంటివి వారి చేత తినిపించడం వంటివి చేస్తూ ఉంటారు.



పిల్లలు పుట్టిన ఆరు నెలల పాటు కేవలం వారికి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాతే తల్లిపాలను మానిపించే ప్రక్రియ మొదలు పెట్టాలి.



హఠాత్తుగా తల్లిపాలను మానిపించకూడదు. రోజులో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు తల్లిపాలు ఇస్తూనే, బయట ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి.



ఆరు నుంచి 12 నెలల వరకు పిల్లలకు లిక్విడ్ డైట్‌నే అలవాటు చేయాలి.



ఓ పక్క తల్లిపాలు తాగిస్తూ లిక్విడ్ డైట్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.



ఏడాది నిండాక తల్లిపాలు మానిపించేయచ్చు.