వ్యక్తిగత కాల్స్, చాట్స్, ఈ మెయిల్స్ లేదా బ్రౌజింగ్ కు కంపెని డివైజ్ వాడకూడదు ఇంట్లో లేదా ఆఫీసులో కంప్యూటర్‌ను లాక్ చేసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్లాలి. కంపెనీ ఫోన్ తో ఫోటోలు తీసుకోవద్దు. డిలీట్ చేసినా అవి ఆటోమెటిక్ బ్యాకప్ ద్వారా క్లౌడ్‌లో సేవ్ అవుతాయి. కంపెనీ డివైజ్‌లో పర్సనల్ ఫైల్స్ ఎప్పుడూ సేవ్ చెయ్యకూడదు. డివైజ్ నుంచి నేవిగేషన్ హిస్టరీని సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు. కనుక కంపెనీ కంప్యూటర్ లో సెర్చింగ్ మానెయ్యాలి. ఎలాంటి ప్రైవేట్ చాట్ ఏ ప్రోగ్రామ్ నుంచైనా చెయ్యకూడదు. సోషల్ మీడియాను వర్క్ డివైజ్ లో తెరవకూడదు. మీ వ్యక్తిగత ఈ మెయిల్ కూడా కంపెనీ డివైజ్ ద్వారా తెరవకపోవడమే మంచిది. మీ కంపెనీ మెయిల్ అకౌంట్ కి సంబంధించిన జీ సూట్, డ్రైవ్స్, డాక్యూమెంట్స్, షీట్స్ లో సైతం మీ వ్యక్తిగత సమాచారం ఉంచకండి. పబ్లిక్ ప్లేస్ లలో వైఫై కోసం కూడా వీపీఎన్ ఉపయోగించడం మంచిదని విశ్లేషకుల సూచన. Representational image:Pexels