కొన్ని రకాల ఆహారాలు వెంటనే శరీరానికి శక్తిని ఇస్తాయి. మీకు బాగా నీరసంగా ఉన్నప్పుడు వాటిని తీసుకుంటే శక్తి వస్తుంది. అరటి పండులో సస్టేయిన్డ్ కార్బోహైడ్రేట్లు పుష్కలం. ఫైబర్ జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఖర్జురాల్లో సహజ చక్కెరలతో ఉండి షుగర్ క్రేవింగ్స్ కి హెల్దీ ప్రత్యామ్నాయయం. ఖర్జూరాలు విటమిన్లు, ఖనిజలవణాలు కలిగి ఉండి వెంటనే శక్తినిస్తాయి. డ్రైఫ్రూట్స్, గింజలతో కలిపి తయారు చేసిన ట్రయల్ మిక్స్ మంచి పోషకాలు కలిగి ఉంటాయి. ఎనర్జీ బార్లు వెంటనే శక్తిని అందించే సాధనాలు. గింజలతో ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వు అందుతాయి. గ్రీక్ యోగర్ట్ ద్వారా మంచి ప్రొటీన్ అందుతుంది. ఇందులోని ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మంచిది. గ్రీక్ యోగర్ట్ ద్వారా కండర పుష్టి కలుగుతుంది. స్మూథీల్లో ఉండే పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ శరీరానికి శక్తినివ్వడమే కాదు హైడ్రేట్ కూడా చేస్తాయి. Representational image:Pexels