పీనట్ బటర్ దీనినే వేరుశనగ వెన్న అంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ బటర్ ని అందరూ ఇష్టంగా తింటారు. ధర కూడా తక్కువే
పీనట్ బటర్‌లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మోనో అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ సహా ఎన్నో పోషకాలు ఎన్నో ఉంటాయి
ముఖ్యంగా షుగర్ పేషెంట్లు పీనట్ బటర్ ను లిమిట్‌గా తీసుకుంటే చాలా మేలు చేస్తుందంటారు ఆరోగ్య నిపుణులు
రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగల సామర్థ్యం పీనట్ బటర్‌కు ఉంది. అందుకే మధుమేహం వ్యాధి గ్రస్తులు రోజుకు ఒక స్పూన్ చొప్పున పీనట్ బటర్‌ను తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి
వేరుశెనగ మరియు వేరుశెనగ వెన్న రెండూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.
డయబెటిస్ ఉన్నవారు స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు పీనట్ బటర్ తీసుకుంటే తీపి తినాలన్న కోరిక తగ్గిపోతుంది
అమెరికాలో 25 మిలియన్లకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ వెన్న తీసుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను విజయవంతంగా నియంత్రించారని ఓ అధ్యయనంలో వెల్లడైంది
పీనట్ బటర్ కొన్నిసార్లు అలెర్జీలకు కారణం కావొచ్చు. ఎలర్జీతో బాధపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశనగ వెన్నని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.