ఆరోగ్యంగా కనిపించే వారి లాలాజలంలో తెల్లరక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంటే అదొక అనారోగ్య హెచ్చరిక.

ఇది చిగుళ్ల ఇన్ఫ్లమేషన్ కు సంకేతంగా భావించాలి.

ఇది గుండె సంబంధ సమస్యలకు సంబంధాన్ని సూచిస్తుందట.

తాజా పరిశోధనలో ఈ విషయమే తేలిందట.

ఇది ఫ్లో మెడియేటెడ్ డైలేషన్ సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తుందని అంటున్నారు.

రక్తనాళాల్లో సమస్య మొదలైందనేందుకు ఇది సూచన అని తేల్చారు.

నోట్లోని ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల్లోకి చేరి అక్కడ ప్రభావం చూపుతుందట.

ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో కూడా చిగుళ్ల ఆరోగ్యానికి గుండె సమస్యలకు సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు.

Representational image:Pexels