మిరపకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. మిరపకాయల్లో పోషకాలు, ఖనిజ లవణాలు కలిగి ఉన్నాయి. మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలం. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. కడుపులో అల్సర్లు కూడా తగ్గుతాయి. మిరపకాయల్లో ఉండే విటమిన్ బి శరీరంలో హోమోసిస్టిన్ పరిమాణాన్ని తగ్గించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది . కడుపుకు మంచిది కాదని అంటారు. నిజానికి ఇది కడుపు నొప్పిని నివారిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గిస్తుంది, కడుపులో పూత ఏర్పడేందుకు దోహదం చేసే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. మిరపకాయల కారం ఐబీఎస్ సమస్య లేని వారి జీర్ణవ్యవస్థకి మంచిది. జీర్ణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ ఉన్నవారికి మిరప అంత మంచిది కాదు. Representational image:Pexels