డయాబెటిక్ రోగులు ముల్లంగిని తినవచ్చా?



ఎంతోమందికి ముల్లంగిని చూస్తే చులకన, ఎందుకంటే దాని వాసన పచ్చిగా ఉంటుంది.



రుచి కోసం చూడకుండా ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండుసార్లు ముల్లంగిని తినడం చాలా అవసరం.



మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక సందేహం ఉంది... తాము ముల్లంగిని తినవచ్చా లేదా అని.



డయాబెటిక్ రోగులు ముల్లంగిని చక్కగా తినవచ్చు.



దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఎంత తిన్నా ఆరోగ్యమే కానీ అనారోగ్యాలు రావు.



అధిక రక్తపోటు ఉన్నవారు ముల్లంగిని తరచూ తినాలి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది.



రోజూ తింటే రక్తనాళాల్లోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. దీనివల్ల బీపీ పెరిగే అవకాశం ఉండదు.



ముల్లంగిని తినేవారిలో చర్మవ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ.