తులసి మొక్కని ప్రతి ఒక్కరూ దైవంగా భావిస్తారు. దానికి నిత్యం పూజలు చేస్తారు. అంత పవిత్రమైనది తులసి.



ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన తులసి మొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.



తులసి ఆకులు నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని వడకట్టుకుని
చల్లారిన తర్వాత తేనె కలుపుకుని తాగాలి.


ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల తులసి ఆకుల రసం జోడించుకోవచ్చు.
ఇది జీవక్రియని ప్రారంభిస్తుంది.


తులసి ఒత్తిడి తగ్గించి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.


ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ విడుదలని తగ్గిస్తుంది.
అడాప్టోజెన్ గా తులసి ఉపయోగపడుతుంది.


జీవక్రియ రేటుని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.



జీర్ణ సమస్యలని తగ్గిస్తుంది. పోషకాల శోషణకి ఉపయోగపడుతుంది.