మీ స్మార్ట్‌ వాచ్‌లో హార్ట్ బీట్ ఇంత చూపిస్తే డేంజరే!

ఆరోగ్య సమస్యలను తెలుసుకోడానికి స్మార్ట్ వాచ్‌లు ఎంతో ఉపయోగకరంగా మారాయి.

ముఖ్యంగా హార్ట్ బీట్ తెలుసుకోడానికి స్మార్ట్ వాచ్ ఎంతో ఉపయోగపడుతుంది.

మరి, మీ హార్ట్ బీట్ ఎంత చూపిస్తే మీరు హెల్తీగా ఉన్నట్లో తెలుసా?

మీ హార్ట్ బీట్ 60 నుంచి 100 లోపు ఉన్నట్లయితే సాధారణంగా ఉన్నట్లు.

నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండే అథ్లెట్ హార్ట్ బీట్ 40 వరకు నమోదవుతుంది.

అయితే, 40 కంటే తగ్గితే ప్రమాదకరమే. మనం నిద్రలో లేదా విశ్రాంతిలో ఉన్నప్పుడే 40 నుంచి 60 ఉంటుంది.

వ్యాయామానికి దూరంగా ఉంటూ, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారి హార్ట్ బీట్ 60 పైనే ఉంటుంది.

హార్ట్ బీట్ అనేది వయస్సును బట్టి కూడా మారుతుంది.

మీ గుండె నిమిషానికి 120 నుంచి 140 సార్లు కొట్టుకుంటే ప్రమాదంలో ఉన్నారని అర్థం.

మీ హార్ట్ బీట్ 100 దాటితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Images Credit: Pexels and Pixabay