మెంతుల నీళ్లతో రోజు ప్రారంభించడం మంచి అలవాటు. ఒక స్పూన్ మెంతులు రాత్రి గ్లాస్ నీళ్లలో నానబెట్టి పొద్దున్నే తాగాలి. జీరా వాటర్ కూడా మంచి హెల్దీ డ్రింక్. జీలకర్రలో చాలా పోషకాలు ఉంటాయి. రాత్రి ఒక టీ స్పూన్ జీలకర్ర గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే కొద్దిగా వేడి చేసి తాగాలి. తేనే, నిమ్మకాయ నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు ఈ హనీ, లెమన్ వాటర్ నిజానికి చాలా పాత చిట్కా, చాలా మంది పాటిస్తారు కూడా. సోంపులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. సోంపు నీళ్లు పరగడుపునే తాగితే బాడీ మెటాబాలిజం మెరుగవుతుంది, త్వరగా బరువు తగ్గొచ్చు. గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చీని పొడి వేసుకుని ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. Representational image:Pexels andi pixabay