భోజనం చేశాక స్వీట్ తినకూడదా?



చివర్లో స్వీట్లు తింటేనే అది సంపూర్ణ భోజనం అనుకునేవారు ఎంతోమంది.



ఎంతోమంది మొదటి స్వీటు తిని భోజనం తినడం లేదా కడుపునిండా భోజనం చేశాక స్వీట్ తినడం వంటివి చేస్తూ ఉంటారు.



పంచదార అనేది ప్రాసెస్డ్ ఫుడ్, అంటే అధికంగా శుద్ధి చేసిన పదార్థం. ఇలా అధికంగా శుద్ధిచేసిన ఆహారాలు ఏవీ మంచివి కాదు.



అధికంగా శుద్ధి చేసిన పంచదారతో చేసిన స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి.



భోజనంలో ప్రధానంగా బియ్యంతో చేసిన రకరకాల పదార్థాలు ఉంటాయి. అన్నంలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది.



తరువాత స్వీట్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగిపోతాయి.



స్వీటు తిన్నాక ఒక గంట వరకు ఆహారాన్ని తినకూడదు లేదా భోజనం చేశాక కనీసం రెండు గంటలు గ్యాప్ ఇచ్చి స్వీట్ తినడం మంచిది.



చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి లేదా చిన్న బెల్లం ముక్క తినండి. కాసేపు ఇటూ అటూ నడవండి.



ఇలా చేయడం వల్ల స్వీట్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.