వీటితో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం, జాగ్రత్త రోజూ కూల్ డ్రింకులు తాగేవారు, చక్కెర కలిపిన పండ్ల రసాలు తాగేవారు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు తినే వారి సంఖ్య అధికంగానే ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇలా చక్కెర కలిపిన పదార్థాలు అధికంగా తింటే దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్ల ఏర్పడే సమస్య ఎక్కువవుతుంది. చక్కెర పదార్థాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. కాబట్టి చక్కెర నిండిన పదార్థాలు తినడం తగ్గించాలి. వీరు దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారాలను తింటే తక్కువ వయసులోనే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో ఇలా తీపి పదార్థాలు అధికంగా తినడం కూడా ఒకటి. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గినా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పంచదార కారణంగానే మూత్రంలో క్యాల్షియం, ఆక్సలైట్ వంటి వాటి పరిమాణాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మూత్రంలో పోగు పడిపోయి చిన్న చిన్న రాళ్ళగా మారుతాయి. కాబట్టి చక్కెర నిండిన ఆహారాలను అధికంగా తినకూడదు.