పచ్చి కూరగాయలు తింటే ఎంతో ముప్పు పచ్చి ఆకుకూరలు, కూరగాయలు తింటే ఎంతో ఆరోగ్యమని అంటారు, కానీ అది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకప్పుడు పంటలు సేంద్రియ పద్ధతిలో పండేవి. ఇప్పుడు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. ఇలా మందులు చల్లిన కూరగయాలు, ఆకుకూరలు తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. క్యాబేజీలను ఎక్కువగా పచ్చిగా తింటూ ఉంటారు. దీనిలో టేప్ వార్మ్స్ ఉండే అవకాశం ఉంది. క్యాప్సికం కూడా బాగా ఉడికించాకే తినాలి. వీటిలో పురుగులు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. అవి కంటికి కనిపించి పరిమాణంలో ఉంటాయి. పాలకూర వంటి ఆకుకూరలు కూడాశుభ్రంగా కడగాలి. వాటిపై పురుగు పట్టకుండా మందులు కొడతారు. ఎంత కడిగినా చల్లిన మందులు ప్రభావం ఉంటుంది. కాబట్టి పచ్చి కూరగాయలు తినకపోవడమే మంచిది. కీరోదోసను తొక్క తీసి తింటేనే మంచిది.