మనం తల దువ్వుకునే దువ్వెనలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లేకపోతే
మీ జుట్టు చాలా నష్టపోతుంది తెలుసా?


శుభ్రమైన దువ్వెన జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది.



దువ్వెనలు శుభ్రంగా ఉంటే తలలోకి నూనె చేరదు. అందుకే రెగ్యులర్ గా వాటిని క్లీన్ చేసుకుంటే
అందులోని బ్యాక్టీరియా తల్లోకి చేరకుండా నిరోధించవచ్చు.


రెగ్యులర్ క్లీనింగ్ వల్ల జుట్టు, స్కాల్ఫ్ మురికిగా ఉండకుండా ఉంటుంది.
ఆరోగ్యకరమైన తల చర్మానికి మద్దతు ఇస్తుంది.


చుండ్రు సమస్య రాకుండా చేస్తుంది. డర్టీ దువ్వెన బ్యాక్టీరియాని పెంచుతుంది.
స్కాల్ఫ్ సమస్యలు కలిగిస్తుంది.


రెగ్యులర్ గా దువ్వెనలు శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కి చోటు ఉండదు.



శుభ్రంగా ఉన్న దువ్వెనలతో తల దువ్వుకుంటే జుట్టు ఆకృతి బాగుంటుంది. వెంట్రుకలు తెగిపోకుండా చేస్తుంది



శుభ్రమైన దువ్వెనతో తల దువ్వుకుంటే రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. జుట్టు పెరుగుదలని
ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది.


జుట్టుకి పోషణ అందేలా చేస్తుంది. సెబమ్ ఉత్పత్తి సజావుగా సాగేలా చూస్తుంది.



జుట్టుకి అందమైన రూపాన్ని ఇస్తుంది.