ఈ ఆహారాలను కలిపి తినకండి



లంచ్‌లో కొన్ని రకాల ఆహారాలను తిన్నాక, మరికొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాలి. అవి బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి.



లంచ్‌లో కిచ్డీ, పరాటాలు తింటే...ఆ తరువాత పాలు, టీ, కాఫీ తాగకూడదు.



గుడ్లు, చేపలు, పండ్లు, పెరుగు, మాంసం వంటివి తింటే కొన్ని గంటల పాటూ వేరుశెనగలు, కొమ్ము శెనగలు, బీన్స్ తినకూడదు.



పాలు, పెరుగు, కీరాదోస, టమోటాలు తిన్నాక నిమ్మరసం జోలికి పోకూడదు.



గుడ్లు, పుల్లని పండ్లు, వేడి పానీయాలు తాగాక పెరుగు తినకూడదు.



చీజ్‌ను గుడ్లు, పండ్లు, పాలు, బీన్స్ తో కలిపి తినకూడదు.



అధిక కొవ్వు ఉన్న పదార్థాలను, అధిక ప్రొటీన్ ఉన్న పదార్థాలను కలిపి ఒకేసారి తినకూడదు.



పచ్చి కూరగాయలు, ఉడికించిన కూరగాయలు కలిపి తీసుకోకూడదు.