ఇప్పుడు ప్రతి ఒక్కరి చెవిలో ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. నిద్రపోయేటప్పుడు
మినహా అన్ని వేళలా అవి చెవిలో పెట్టుకునే ఉంటున్నారు.


కానీ రోజంతా ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల వినికిడి, మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.



ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సౌండ్ ఎక్కువగా పెట్టి మ్యూజిక్ వినడం వల్ల చెవిలోని సున్నితమైన జుట్టు కణాలు
దెబ్బతింటాయి. శాశ్వత వినికిడి లోపం రావచ్చు.


ఇయర్ ఫోన్స్ వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.



అధికంగా వీటిని ఉపయోగించడం వల్ల టిన్నిటప్ సమస్య వస్తుంది.
అంటే నిరంతరం చెవిలో ఏవో శబ్దాలు మోగుతున్నట్టు అనిపిస్తాయి.


నిత్యం వాటిని పెట్టుకుని ఉండటం వల్ల చుట్టు ఉన్న శబ్దాలు డీసెన్ సీటైజ్ అవుతాయి. వినికిడి సామర్థ్యం
తాత్కాలికంగా తగ్గిపోతుంది.


వేరే పనుల్లో ఉన్నప్పుడు కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల వర్క్ మీద
శ్రద్ద సన్నగిల్లుతుంది. సరిగా పని చేసుకోలేరు.


వైర్ లెస్ ఇయర్ ఫోన్ వల్ల వచ్చే విద్యుదయస్కాంతాలు తలనొప్పికి కారణమవుతాయి.



మైగ్రేన్ కలిగిస్తాయి.



ఎప్పుడు ఒక్కరే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ లోకంలో ఉండటం వల్ల చుట్టుపక్కల వారితో గడిపే సమయం
కోల్పోతారు. అది మీ సంబంధాలని దెబ్బతీస్తుంది.