నల్ల మిరియాలు ఆహారానికి రుచి మాత్రమే కాదు, పొట్ట చుట్టు ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. మిరియాల్లో ఉండే పైపరిన్ తక్కువ మోతాదులో తీసుకున్నపుడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మిరియాల్లో ఎన్నో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్స్ కొవ్వు కణాలను విడగొడతాయి. మిరియాలు శరీరంలో జీవక్రియలను సంతులనం చేస్తాయి. ఇది కొవ్వు త్వరగా కరిగేందుకు దోహదం చేస్తుంది. మిరియాల్లో యాంటిఆక్సిడెంట్స్ పుష్కలం. ఇవి ఆక్సిడేషన్ నష్టాన్ని కూడా నివారిస్తాయి. మిరియాల కషాయం తాగితే నిండిన భావనతో ఆహారం తక్కువ తింటారట. మిరియాలు మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే జీర్ణాశయంలో ఇబ్బందులు రావచ్చు. Representational image:Pexels