కిడ్నీలో రాళ్లుంటే ఉప్పు, ఆసిడ్, కొన్ని ఖనిజలవణాలు కలిసి ఏర్పడతాయి. కిడ్నీల్లో రాళ్ల ఏర్పడకుండా నివారించడంలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది ఉప్పు వల్ల మూత్రంలో క్యాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి. జంతు సంబంధ ప్రొటీన్ వల్ల యూరిక్ ఆసిడ్ పెరగవచ్చు. అందువల్ల సిట్రేట్ ఉత్పత్తి తగ్గుతుంది సిట్రేట్ కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారు పాలకూర తినకపోవడమే మంచిది. బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సమస్యను తీవ్రం చెయ్యవచ్చు. సోడా కలిగిన కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. వీటివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ కూడా తినొద్దు సంతృప్త చక్కెరలు కూడా తగ్గించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. Representational image:Pexels