డియోడరెంట్లను ఎలా పడితే అలా వాడటం మంచిది కాదు. శరీరం శుభ్రం చేసుకుని, ఆరబెట్టుకున్న తర్వాతే డియోడరెంట్ వాడాలి. డియోడరెంట్లు పరిమితంగా వాడాలి. కొద్దిగా వాడితే సరిపోతుంది. రకరకాల డియోడరెంట్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. చర్మానికి సరిపడే డియోడరెంట్ ఎంచుకోకపోతే చర్మ సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం కలిగిన వారు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, హైపోఎలర్జెనిక్ ఫార్మూల కలిగిన డియోడరెంట్లు వాడాలి. షేవింగ్ తర్వాత వెంటనే డియోడరెంట్ వాడకూడదు. అలా వాడితే మీ చర్మానికి నష్టం జరగవచ్చు. డియోడరెంట్ ఎంచుకునే ముందు కచ్చితంగా లేబుల్స్ చదవాలి. అందులో వాడే పదార్థాలు మీకు అలర్జీ కలిగించవచ్చు. Representational image:Pexels