ఉదయాన రెండు ఖర్జూరాలు తింటే చాలు ఖర్జూరాలు బలవర్ధకమైన ఆహారాల జాబితాలోకి వస్తాయి. ఖర్జూరాల నుంచి నిండుగా లాభం పొందాలంటే వాటిని ఉదయాన్నే తినాలి. రోజుకు రెండు తింటే చాలు ఎంతో ఆరోగ్యం. ఖర్జూరాల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు వీటిని రోజూ తినాలి. అలసట, నీరసంతో బాధపడేవారు ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మంచిది. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్న వారు వీటిని తింటూ ఉంటే మేలు. వీటిలో మెగ్నీషియం, కాల్షిాయం, ఫాస్పరస్, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. ఖర్జూరాలు రోజుకు రెండు తింటే చాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రోజూ ఖర్జూరాలు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.