వీటిని తింటే చెమట దుర్వాసన తప్పదు



కొందరిలో ఆ చెమట విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇది చుట్టుపక్కల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.



చెమట దుర్వాసన వేయకుండా కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి.



శాఖాహారులతో పోలిస్తే మాంసాహారం తినే వ్యక్తుల నుంచి వచ్చే చెమట విపరీతంగా దుర్వాసన వస్తుంది.



వెల్లుల్లిని, ఉల్లిపాయల్ని అధికంగా తినేవారిలో కూడా ఈ చెమట కంపు అధికంగా ఉంటుంది.



మసాలా వేసిన ఆహారాన్ని అధికంగా తిన్నా కూడా చెమట వాసన రావడం ఖాయం.



ఎవరైతే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారో వారి నుంచి దుర్వాసన ఎక్కువగా రాదు.



కొవ్వు ఉన్న ఆహారాలు, మాంసం, గుడ్డు లాంటివి తినేవారిలో మాత్రం విపరీతంగా చెమట దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.



తాజా పండ్లు, తాజా కూరగాయలతో వండిన ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. చెమట వాసన రాదు.