అన్వేషించండి

Krishna Janmashtami 2023 Date: శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబరు 6 or 7 - ఎప్పుడు జరుపుకోవాలి!

2023లో శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి..సెప్టెంబరు 6 బుధవారమా, సెప్టెంబరు 7 గురువారమా..పండితులు ఏం చెబుతున్నారు...

Krishna Janmashtami 2023 Date:  పండుగలన్నీ తిథుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు. కానీ కృష్ణాష్టమి విషయంలో గందరగోళం రావడానికి కారణం తిథులు తగులు,మిగులు రావడమే. పంచాంగకర్తలు ఏ రోజైతే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారో ఆ రోజు సూర్యోదయానికి అష్టమి తిథి లేదు. మర్నాడు అష్టమి తిథి ఉంది. దీంతో కృష్టాష్టమి ఏ రోజు జరుపుకోవాలా అనే గందరగోళం నెలకొంది. ఇంతకీ   
కృష్ణాష్టమి 6వ తేదీనా? లేక 7వ తేదీన జరుపుకోవాలా? అంటే ముందుగా తిథులు గురించి చూసుకోవాలి...

Also Read: సెప్టెంబరు నెల ఈ రాశులవారికి అదృష్టాన్నిస్తుంది, ఆర్థికంగా కలిసొస్తుంది

అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు

  • సెప్టెంబరు 6 సప్తమి బుధవారం రాత్రి 7 గంటల 58 నిముషాల వరకూ ఉంది.. ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలయ్యాయి.
  • సెప్టెంబరు 7 అష్టమి గురువారం రాత్రి 7 గంటల 47 నిముషాల వరకూ ఉంది.

కన్నయ్య జన్మనక్షత్రం రోహిణి

సెప్టెంబరు 6 బుధవారం మధ్యాహ్నం  2 గంటల 42 నిముషాల వరకూ కృత్తిక నక్షత్రం ఉంది..ఆ తర్వాత ప్రారంభమైన రోహిణి నక్షత్రం సెప్టెంబరు 7 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంది.

Also Read: లోకంలో మనుషులంతా ఇలాగే ఉంటారు, అర్థం చేసుకోరూ!

కృష్ణాష్టమి ఎప్పుడు

సాధారణంగా పుట్టిన రోజులన్నీ కూడా సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు. నక్షత్రం ఒక్కరోజు అటు ఇటు ఉన్నాకానీ తిథి ముఖ్యం. అయితే పంచాంగకర్తలంతా సెప్టెంబరు 6నే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో. అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మర్నాడు ఉదయం. అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానం అంటారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.

కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో అష్టోత్తర పూజ,  సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతారు. కృష్ణాష్టమి రోజు భాగవతం, భగవద్గీత పఠించాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రోజంతా ఉపవాసం ఉండి అర్థరాత్రి కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రత్యేక పూజలు చేసి మర్నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. 

Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Adilabad Tiger News Today: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
Thala Movie Teaser: హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కొడుకు - ‘తల’ టీజర్ చూశారా?
హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కొడుకు - ‘తల’ టీజర్ చూశారా?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Embed widget