అన్వేషించండి

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!

Bhamapravesam Akshara Devalla: భామా ప్రవేశం పేరుతో కూచిపూడి రంగప్రవేశం చేసింది 14 ఏళ్ల అక్షర దేవళ్ల. రెండున్నరగంటలపాటూ భామాకలాపం అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది...

Akshara Devalla Kuchipudi dancer 

14 ఏళ్ల చిన్నారి కూచిపూడి రంగప్రవేశం

రెండున్నర గంటల పాటు సాగిన అభినయం

భామాకలాప ప్రదర్శన చూసి సత్యభామే దిగి వచ్చిందా అని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు

భామాప్రవేశం పేరుతో హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై జరిగిన ప్రదర్శన

అతి చిన్న వయస్సులోనే భామా కలాపం ప్రదర్శించిన చిన్నారిగా రికార్డ్ క్రియేట్ చేసిన అభినవ సత్యభామ అక్షర దేవళ్ల

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!
 
కూచిపూడి నాట్య సంప్రదాయంలో అత్యంత శోభాయమానమైన భామాకలాపాన్ని 14 ఏళ్ల అక్షర దేవళ్ల  అత్యద్భుతంగా ప్రదర్శించి  ఐదు అంతర్జాతీయ, జాతీయ స్థాయి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తన కూచిపూడి రంగ ప్రవేశాన్ని భామాప్రవేశం పేరుతో  రవీంద్రభారతి వేదికపై అక్షర దేవళ్ల రసరమ్యంగా ప్రదర్శించింది. 

కూచిపూడి పితామహుడు సిద్ధేంధ్రయోగి రచించిన భామా కలాపాన్ని..సాధారణంగా సీనియర్ కళాకారులు గంట సమయానికి కుదించి ప్రదర్శిస్తారు. అయితే అక్షర దేవళ్ల సంప్రదాయ పరంగా దీనిని పూర్తి రూపంలో రెండు గంటల 30 నిమిషాలపాటు  నిరంతరాయంగా ప్రదర్శించి  తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అక్షర.

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!

సంగీతం,సంభాషణ, గానం, ఆహార్యం , అభినయం, హావభావ సమ్మేళిత సంపూర్ణ నృత్యనాటకం భామాకలాపం. నిజంగా సత్యభామే దిగి వచ్చిందా అన్నట్టు శృంగార, వీర, విరహ రసాలతో కూడిన సత్యభామ పాత్రలో పరకాయప్రవేశం చేసింది అక్షర.  సత్యభామలా గర్వాన్ని నఖశిఖపర్యంతం చూపిస్తూనే శ్రీకృష్ణుడు తనకు దూరమయ్యాడన్న విరహవేదనను కూడా అంతే లాఘవంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది.
 
అక్షర దేవళ్ల చేసిన ఈ అసాధారణ నాట్యప్రదర్శనను...

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్

గోల్డెన్ స్టార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్

జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్  గుర్తించాయి. రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థల ప్రతినిధులు హాజరై స్వయంగా చిన్నారి అక్షరకు అందజేశారు.

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!

కూచిపూడి నృత్యాన్ని తన తల్లి కూచిపూడి గురు భావన పెదప్రోలు దగ్గర నేర్చుకుంది అక్షర. మూడో ఏటే నేర్చుకోవడం ప్రారంభించిన అక్షర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ మధ్యే అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అక్షర, అక్కడా తన నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 

కూచిపూడి నృత్యకారిణిగానే కాదు బాలనటిగా అక్షర టాలీవుడ్ లో 15 సినిమాల్లో నటించింది. ఈ మధ్య నితిన్ తమ్ముడు సినిమాలోనూ అక్షర మంచి పాత్ర పోషించింది. అక్షర నాట్యప్రదర్శనలు చూసి ముగ్దులైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ తన ఆశ్రమానికి సాంస్కృతిక రాయబారిగా  నియమించారు. 

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!

ఇప్పుడు భామాకలాపం రికార్డు ప్రదర్శనతో కూచిపూడి ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది అక్షర సంపాదించుకుంది. ఈ  రంగప్రవేశం కార్యక్రమానికి హాజరైన కూచిపూడి గురువులు చిన్నారి అక్షరను ఆశీర్వదించారు

Akshara Devalla: 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుత ప్రతిభ ! సత్యభామే దిగివచ్చిందా అనిపించేలా ప్రదర్శన , భామాకలాపంలో రికార్డులు!

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి...12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget