Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
వివిధ శాస్త్ర గ్రంథాల ప్రకారం భారతీయ సంస్కృతిలో 64 కళలు - విద్యలు ఉన్నాయి. వాటినే చతుషష్టి కళలు అంటారు. అవేంటో చూద్దాం..
![Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే Chatushashti Kalalu: Intersting facts of 64 arts,Chatushashti Kalalu , know in details Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/17/0e63a288a49b427ef3ead8969aa2c11c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చతుషష్టి కళలు తెలియజేసే శ్లోకం
"వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే"
ఆ 64 కళలు ఇవే
1.వేదాలు (ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం)
2.వేదాంగాలు (శిక్షలు, వ్యాకరణం , ఛందస్సు , జ్యోతిష్యం, నిరుక్తం, కల్పాలు)
3.ఇతిహాసాలు (రామాయణం,మహాభారతం, భాగవతం, పురాణాలు)
4.ఆగమశాస్త్రాలు (శైవాగమం ,పాంచరాత్రాగమం , వైఖానసాగమం ,స్మార్తాగమం)
5.న్యాయం (తర్కశాస్త్రానికి మరో పేరు)
6.కావ్యాలంకారాలు(సాహిత్యశాస్త్రం)
7.నాటకములు
8.గానం (సంగీతం)
9.కవిత్వం (ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడం)
10.కామశాస్త్రం
11.ద్యూతము (జూదమాడడం-జూదానికి సంబంధించిన సూక్తములు ఋగ్వేదంలో కొన్ని ఉన్నాయి. కార్తిక శుద్ధ పాడ్యమి రోజు జూదమాడాలని శాస్త్రవచనం)
12.దేశభాషాజ్ఞానం
13.లిపికర్మ (దేశభాషలకు సంబంధించిన అక్షరాలు నేర్పుగ వ్రాయువిధానం)
14.వాచకం (ఏగ్రంధమైననూ తప్పులేకుండా శ్రావ్యముగా అర్థవంతముగ చదువగల నేర్పు)
15.సమస్తావథానములు (అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యం)
16.స్వరశాస్త్రము (ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంథించిది, ఇడా పింగళా సుషుమ్న నాడులకు సంబంధించినది)
17.శకునం (ప్రయాణ కాలంలో పక్షులు, జంతువులు, మనుషులు ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్ తెలియజేసే శాస్త్రం)
18.సాముద్రికం (హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభములు చెప్పే శాస్త్రం)
19.రత్నపరీక్ష (నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత గురించి సంపూర్ణ జ్ఞానం)
20.స్వర్ణపరీక్ష (బంగారాన్ని గుర్తించే జ్ఞానం)
21.అశ్వలక్షణం (గుర్రాలకు సంబంధించిన జ్ఞానం)
22.గజలక్షణం (ఏనుగులకు సంబంధించిన జ్ఞానం)
23.మల్లవిద్య (కుస్తీలు పట్టడం)
24.పాకకర్మ (వంటలు)
25.దోహళం (వృక్షశాస్త్రం)
26.గంధవాదము (వివిధ రకాలైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు)
27.ధాతువాదము (రసాయన వస్తువుల గురించి సంపూర్ణ అవగాహన)
28.ఖనీవాద (గనులకు సంబంధించిన శాస్త్రం)
29.రసవాదము (పాదరసము లాంటివాటితో బంగారం చేయు నేర్పు)
30.అగ్నిస్తంభన (అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి)
31.జలస్తంభన (నీళ్ళను గడ్డగట్టించి అందులో ములగడం)
32.వాయుస్తంభనం (గాలిలో తేలియాడు విద్య)
33.ఖడ్గస్తంభన (శత్రువుల ఖడ్గాలను నిలుపుదల చేసే విద్య)
34.వశ్యము (పరులను లోబచుకొనే విద్య)
35.ఆకర్షణం (పరులను ఆకర్షించే విద్య)
36.మోహనం (పరులను మోహింపజేసే విద్య)
37.విద్వేషణం(పరుల మధ్య గొడవలు పెట్టడం)
38.ఉచ్ఛాటనం (ఇతరులను ఉన్నచోట నుంచి వెళ్లగొట్టడం)
39.మారణం (పరులకు ప్రాణహాని కల్గించడం)
40.కాలవంచనం (కాలాన్ని కానీ కాలమాన పరిస్థితులను కానీ మార్చే నేర్పు)
41.వాణిజ్యం ( వ్యాపారం)
42.పాశుపాల్యము (పశువులను పెంచడంలో నేర్పు)
43.కృషి (వ్యవసాయ నేర్పు)
44.ఆసవకర్మ (ఆసవములను,మందులను తయారు చేసే రీతి)
45.లాపుకర్మ (పశుపక్ష్యాదులను స్వాధీనపరుచుకొనే రీతి)
46.యుద్ధం (యుద్ధం చేసే నేర్పు)
47.మృగయా (వేటాడే నేర్పు)
48.రతికళాకౌశలం (శృంగార కార్యాల్లో నేర్పు)
49.అద్మశ్యకరణీ (పరులకు కనిపించకుండా ఉండడం)
50.ద్యూతకరణీ (రాయబార కార్యాల్లో నేర్పు)
51.చిత్ర (చిత్రకళ)
52.లోహా (పాత్రలు తయారు చేసే నేర్పు)
53.పాషాణ (రాళ్ళు చెక్కే కళ అంటే శిల్పకళ)
54.మృత్ (మట్టితొ చేసే పనుల్లో నేర్పు)
55.దారు (చెక్కపని)
56.వేళు (వెదరుతో చేసే పనులు)
57.చర్మ (తోళ్ళతో తయారీ)
58.అంబర (వస్త్రాలు తయారీ)
59.చౌర్య ( దొంగతనం చేయుటంలో నేర్పు)
60.ఓషథసిద్ధి (మూలికల ద్వారా కార్యసాధనావిధానం)
61.మంత్రసిద్ధి (మంత్రముల ద్వారా కార్యసాధనం)
62.స్వరవంచనా (కంఠధ్వనివల్ల ఆకర్షణం)
63.దృష్టివంచన (అంజనవంచన -చూపులతో ఆకర్షణం)
64.పాదుకాసిద్ధి (ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య)
Also Read: 2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు
Also Read: 2022-2023లో ఈ రాశివారికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు, కష్టపడాలి-జాగ్రత్తపడాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)