భార్య అందంగా ఉంటే అదృష్టమా? విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసా?
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దృతరాష్ట్రుడు తన కుమారుల భవిష్యత్తు గురించి బెంగ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో నీతి కోవిధుడైన విదురుడు ఆ రాజుకు ధైర్యం చెబుతూ చెప్పిన మాటలు ఇప్పటికీ ఆచరణీయం.
విదురుడు భారతంలోని ఉద్యోగ పర్వంలో మనిషి జీవితం సుఖప్రదంగా, నీతిగా బతికేందుకు కావల్సిన అనేక విషయాలను వివరించాడు. ఈ ఆరు రకాల భాగ్యాలు ఉన్నవారు అందరి కంటే అదృష్టవంతులుగా చెప్పాడు. వారేవరో చూద్దాం.
సంపద – ఈరోజుల్లో సంపదకు ఉన్న విలువ మరి దేనికి లేదు. డబ్బుంటే ఎంత పెద్ద కార్యమైనా విజయవంతం చెయ్యొచ్చు. ఎంత చిన్న అవసరమైనా తీర్చుకోవచ్చు. సంపద కలిగి ఉండే వాడు సుఖదాయకమైన జీవితం గడపగలుగుతాడు. అందువల్ల అవసరానికి తగినంత సిరి సంపదలు కలిగి ఉండే వాడు అదృష్ట వంతుడు.
ఆరోగ్యం – అందరూ మూకుమ్మడిగా కాదనలేని విషయం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే నానుడి. అంతేకాదు శరీర మాధ్యమం ఖలు ధర్మసాధనం. ఆరోగ్యం బావుండి శక్తివంతమైన శరీరం ఉన్నవాడు ఏ పనినైనా కష్టపడి చెయ్యగలడు. ఫలితంగా విజయాలు పొందగలుగుతాడు. అయితే ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేని వాడు అదృష్టవంతుడు కాలేడు. ఆరోగ్యమే లేకపోతే ఏ సంపదను అనుభవిచనూ లేడు. ఏదో చెయ్యాలని మనసు తహతహలాడుతుంది. కానీ చేసేందుకు శరీరం సహకరించలేదంటే అంతకు మించిన బాధ మరొకటి లేదు. మీరు అదృష్ట వంతుల్లో ఒకరిగా ఉండాలనుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
అందమైన భార్య – విదురుడు చెప్పిన దాని ప్రకారం అందమైన భార్య ఉండడం అదృష్లం. గుణ శీలీ, అందగత్తే అయిన భార్య ఉన్నవాడి మనసు అడ్డదారులు తొక్కదు అనేది విదుర నీతి. నిశ్చలమైన మనసు కలిగి ఉండడం కూడా అదృష్టమే. నిశ్చలమైన మనసుతో పని మీద ద్యాసతో, భార్య మీద ప్రేమతో చరించే పురుషుడిని విజయం వరిస్తుంది. అది సంపదల రాకకు కారణం అవుతుంది. కనుక అందమైన, అనుకూలవతి అయిన భార్య ఉండడం అదృష్టం.
మృదు భాషి అయిన భార్య – నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అలా మృదుభాషి అయిన భార్యను కలిగిన వాడు కూడా అదృష్ట వంతుడే. ఆమె తన మాటలతో ఇంట్లో అందరి మనసులు గెలుచుకుంటుంది. అందరిని ఆనందంగా ఉంచుతుంది. కుటుంబం ఆనందంగా ఉంటే అంతకంటే కావల్సింది ఏముంటుంది. అందుకే మృధు భాషి అయిన భార్యను కలిగిన వాడు అదృష్ట వంతుడు.
విదేయత కలిగి కుమారుడు – చెప్పిన మాట విని సత్ప్రవర్తన కలిగిన సంతానం కలిగిన వాడు అదృష్ట వంతుడు. కొడుకు పుట్టగానే కలిగే సంతోషం కంటే అతడు ప్రయోజకుడై నలుగురు మెచ్చుకునే విధంగా జీవితం సాగిస్తున్నపుడు మరింత ఆనందం కలుగుతుంది. అందుకే విదుర నీతి తెలివి తేటలు కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, వినయ విధేయతలు కలిగిన కొడుకు ఉండడం అదృషం.
ఆర్థిక అవగాహన – జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. ఎత్తులో పొంగిపోవడం, పల్లంలో పడి పోవడం చెయ్యకూడదు. ఆర్థికంగా బలంగా ఉన్నపుడు సరైన ప్రణాళికతో ఆర్థిక సుస్థిరతను సాధించే తెలివి తేటలు కలిగి ఉండడం, ఆర్థిక కుంగుబాటు సమయంలో ఢీలా పడిపోకుండా సంయమనంతో సరైనా ఆలోచనా విధానాన్ని కలిగి ఉండడం, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు కావల్సిన శక్తి సంతరించుకోగలగడం అదృష్టం అని విదురనీతి బోధిస్తోంది.
Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?
Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు