అన్వేషించండి

విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?

మహాభారతం ఉద్యోగపర్వంలో సందర్భానుసారంగా విదురుని చేత ధృతరాష్ట్రునికి చెప్పించిన సామజిక రాజకీయ, కుటుంబ జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు “విదురనీతి” లుగా ప్రసిద్ధి చెందాయి.

సంజయుడు పాండవ శిబిరం నుంచి తిరిగి వచ్చి పాండవుల మనసులో మాటను ద్రుతరాష్ట్రునికి వివరించి చెప్పిన తర్వాత.. పాండవుల మనోగతం తెలిసిన ద్రుతరాష్ట్రుడు చాలా బెంగ పడతాడు. అప్పుడు విదురుడు ద్రుతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ జీవితానికి అవసరమైన అనేక విషయాల గురించి వివరిస్తాడు. అతడి నీతి వాక్యాలు ఇప్పటికీ ఆచరణీయం. అటువంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఎవరికి నిద్ర పట్టదు?

నిద్ర పట్టకపోవడం ఒక మానసిక స్థితి. పగలంతా కష్టించి పనిచేసే వాడికి నిద్ర లేకపోవడం ఉండదు. కష్టం తెలియని సుఖ లాలసునికి నిద్ర దొరకదు. అంతేకాదు, చింతలు వేధించే వారిని కూడా నిద్ర వరించదు. అసలు నిద్ర పట్టని బెంగ ఎందుకుంటుంది? ఎటువంటి వారికి నిద్ర దూరం అవుతుందనే విషయాలను విదుర నీతిలో చక్కగా వివరించారు.

ఈ లక్షణాలుంటే నిద్రకు లోటు ఉండదు: సాత్విక స్వభావంతో మెదిలేవాడు, ధర్మం తప్పని వాడిని ఎవ్వరూ వంచించలేరు. దుర్మార్గపు ఆలోచనలకు దూరంగా ఉండడం, సత్కర్మలు ఆచరించడం, అబద్ధం చెప్పకపోవడం ఉత్తముడి లక్షణాలు. అల్ప సంతోషము, ఆత్మ స్తుతి, కోపిష్టి తనము, ఇతరులెవ్వరిని మోసం చెయ్యని వాడే విధ్వాంసుడు. లోకవ్యవహారం గ్రహిస్తూ శక్తిని అనుసరించి కృషి చేస్తూ, అర్హతను మించి ఆశించకుండా ఉండే వాడు లౌక్యం తెలిసిన వాడు. దు:ఖ సమయాల్లో సంయమనం కోల్పోకుండా, గడిచిన కాలం గురించి, పోయిన వాటి గురించి బాధపడకుండా, ధైర్యం కోల్పోకుండా మొదలు పెట్టిన కార్యాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదలని వాడు ధీరుడు. ఇటువంటి వారికి కార్యసాధనలో అపాయం లేని విధానాలు వారికి బోధ పడతాయి. రాత్రి పూట సుఖ నిద్ర కోరుకునే వాడు పగటి పూట అందుకోసం శ్రమించాల్సి ఉంటుంది. సత్యం, క్షమ, దానం, అసూయ లేకపోవడం, ఆరోగ్యం, అనుకూలవతి అయిన బార్య, చెప్పుచేతలలో ఉండే పుత్రుడు, ధనార్జనకు ఉపయుక్తమైన విద్య ఈ లోకంలో సుఖాన్ని అందించే దారులు. ఇవి కలిగి ఉన్న వారు చింతలేని జీవితాన్ని గడుపుతారు. ఇటువంటి వారికి నిద్రకు లోటు ఉండదు.

ఇలాంటివారికి నిద్ర కరువే: బలవంతులతో విరోధం బలహీనులకు మంచిది కాదు. ఇతరుల సంపదలు హరించే వాడికి, దొంగకు, అతిగా కామం కలిగిన వాడికి రాత్రుళ్లు నిద్రపట్టదు. అయోగ్యులకు బాధ్యతలు అప్పగించిన వారికి కూడా సుఖ నిద్ర ఉండదు. విద్యా వివేకం లేకుండానే గర్వంతో చరించేవాడు, దరిద్రుడై ఉండి విపరీతమైన భోగ లాలస కలిగి ఉండే వాడు అసూయతో రగిలి పోతుంటాడు. ఇటువంటి వారు తమకు తామే శత్రువులు. ఏ కృషి చెయ్యకుండానే ఫలితాలను ఆశించేవాడు, స్వంత పనులు వదిలి ఇతరుల పనులకు ప్రాముఖ్యతను ఇచ్చేవాడు, తమ కంటే బలవంతులతో వైరం పెంచుకునే వాడు, ప్రతీకార వాంఛతో రగిలిపోయే వాడు, రకరకాల అనుమానాలతో చెయ్యాల్సిన పనులను వాయిదా వేసేవాడు, మిత్రులు లేని వాడు, పితృకార్యాలు నిర్వహించని వాడు, ఇతరులలో ఎప్పుడూ లోపాలు వెతికేవాడు, అర్థం లేకుండా కోపం తెచ్చుకునేవాడు వీరంతా కూడా మూర్ఖులే. ఇటువంటి మూర్ఖత్వంతో చరించే వారికి రాత్రి పూట నిద్ర కరువవుతుంది.

Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు

Also Read: ఈ తేదీల్లో పుట్టినవారికి శత్రువులు కూడా స్నేహహస్తం అందిస్తారు, అక్టోబరు 8 న్యూమరాలజీ

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget