Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారికి శత్రువులు కూడా స్నేహహస్తం అందిస్తారు, అక్టోబరు 8 న్యూమరాలజీ
Numerology prediction 8th October 2022 : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈరోజు( అక్టోబరు 8) ఎవరెవరికి కలిసొస్తుంది? న్యూమరాలజీ నిపుణులు ఏం చెప్పారో..ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
Numerology prediction 8th October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 8 శనివారం రోజు ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఓ సమస్యకి పరిష్కారం పొందడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రత్యర్థులు కూడా స్నేహ హస్తం అందిస్తారు. ఉద్యోగం ఇంటిపని మధ్య సామరస్యాన్ని కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. మార్పులు చేర్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. తొందరపాటు కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు హనుమంతుడిని ఆరాధించండి.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఏదైనా శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. మీరు అందరి అంచనాలను అందుకుంటారు. అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతే కొత్త కార్యక్రమం చేపట్టండి. అశాంతి, మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారానికి సంబంధించిన లాభదాయకమైన ఆఫర్లు లభిస్తాయి. ఈ రోజు గణేశుడికి దూర్వార యుగ్మం సమర్పించండి.
Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
మీరు ప్రియమైన వ్యక్తి నుంచి బహుమతి పొందుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ సమయంలో శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఆలోచనలను అందరికీ వెల్లడించవద్దు. అనారోగ్య సమస్యల కారణంగా మీరు వైద్యులను సంప్రదించాల్సి రావొచ్చు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఈ రోజు శివలింగంపై పాలు పోయండి.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ రోజు ఏదైనా సమస్యను పరిష్కరించడంలో విజయవంతమవుతారు. పిల్లలు మీ మాట వింటారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో రాణిస్తారు. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఒకరి అసూయ కారణంగా మీరు ఇబ్బంది పడతారు. రాజకీయ పనులు వేగవంతమవుతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఈ రోజు రావి చెట్టుకింద దీపం వెలిగించండి
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈ రోజు సాధించగలరు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. పెట్టుబడికి సంబంధించిన కార్యకలాపాల్లో జాగ్రత్త అవసరం.మీరు వైరుధ్య పరిస్థితిలో చిక్కుకుపోవచ్చు. ఈ సమయంలో ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు మీరు విష్ణువును ఆరాధించండి.
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఇంటర్యూలకు వెళ్లేవారు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. అనకున్న పని అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం ఉంటుంది. ప్రయాణం ఫలవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు శ్రీకృష్ణుని పూజించండి.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఆదర్శవంతమైన వ్యక్తి నుంచి మీరు ప్రేరణ పొందుతారు. తొందరపాటుతో నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఓపిక పట్టాలి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది. ఇంట్లో పార్టీ వాతావరణం ఉంటుంది. ఎలాంటి ప్రణాళికల గురించి ఎవరితోనూ మాట్లాడకండి.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
కొందరు వ్యక్తులు మీకు ప్రతికూల పరిస్థితులను సృష్టించవచ్చు. మీపై ఆధిపత్యం చెలాయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మీ లక్ష్య సాధనకు మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. స్నేహితులతో కొంత సమయం గడిపే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు.