20 june to 26 june Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అనారోగ్యం, మానసిక ఆందోళన
Weekly Horoscope:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
![20 june to 26 june Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అనారోగ్యం, మానసిక ఆందోళన 20 june to 26 june Weekly Horoscope saptahik rashifal 20 june to 26 june 2022 tula to meena rashi weekly horoscope 20 june to 26 june Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అనారోగ్యం, మానసిక ఆందోళన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/82949c788e6dd8a60d95158a1eaedcef_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 జూన్ 20 నుంచి 26 వరకు వారఫలాలు (Weekly Horoscope 20 june to 26 june)
తుల
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనిలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. పై అధికారులతో వాగ్వాదానికి దిగొద్దు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్నా అవసరానికి డబ్బు చేతికందుతుంది. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులకు బాగానే ఉంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలనుంచి బయటపడతారు. ఓర్పును కోల్పోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో మానసిక ఆందోళన. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది
ధనుస్సు
ఈ వారం మీకు మిశ్రమఫలితాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ, అనారోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మనస్పర్థలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గతంలో సంఘటనలు గుర్తు చేసుకుంటారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగుకు ఒత్తిడి పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆవేశం తగ్గించుకోండి.
మకరం
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్వవహారాలు బాగానే సాగుతాయి. ఆత్మీయుల నుంచి సహకారం ఉంటుంది. ఈ వారంలో జరిగే ఓ సంఘటన వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరేంటనేది తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వారం చివర్లో బంధువులతో వివాదాలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
Also Read: ఈ రాశివారు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఎలాంట ఆంటకాలు లేకుండా సాగిపోతాయి. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. మాటలతో ఎదుటివారిని కట్టిపడేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కళారంగం వారికి కొన్ని సమస్యలు తీరుతాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులుంటాయి.
మీనం
మీన రాశివారికి గ్రహబలం ఈ వారం మిశ్రమంగా ఉంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ పరపతి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా సానుకూలమైన సమయం. వారం చివరిలో మానసిక వేదన, అనారోగ్య సూచనలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
Also Read: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)