అన్వేషించండి

Women's Reservation Bill: మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామం: షర్మిల

మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైఎస్ షర్మిల స్పందించారు.

మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ బిల్లుపై స్పందించిన షర్మిల మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సహకారం కాబోతుందని షర్మిల వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల జాప్యం తర్వాత మహిళా బిల్లుపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. 

మహిళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభాలో సగమైన మహిళలకు సమాన హక్కులు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో కొంతమేరకు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ బిల్లు ప్రవేశ ప్రవేశ పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం విషయంలో రాజకీయలకు అతీతంగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవర్తించాలని వైఎస్ షర్మిల విన్నవించారు. రాజకీయాలకు పోయి ఈ బిల్లు ముఖ్య దేశాన్ని నీరుగార్చకుండా ఉండాలని ఆకాంక్షించారు. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళ రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరూ మద్దతు ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

మహిళల కళ సాకారమవుతున్న వేళ మహిళలందరికీ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు మహిళ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ అడ్డుపడుతుందని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో బిల్లు తీసుకువస్తుంది, దీనిపై విధివిధానాలు ఏమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ముందడుగు అభినందనీయమని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువు అయిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రివర్గానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ఉన్న అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్.....
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడోవంతు సీట్లు మహిళ అభ్యర్థులకు కేటాయించబడతాయని వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం సరి అయిందని వ్యాఖ్యానించారు.  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ... ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
Embed widget