అన్వేషించండి

Ys Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల - అధిష్టానం కోరిక మేరకు నిర్ణయం!

Andhra News: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ys Sharmila Contesting From Kadapa Parliament: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పోటీ చేయనున్నారు. కడప నుంచి పోటీ చేయాలని ఆమెపై కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. హస్తం పెద్దల కోరిక మేరకు ఆమె కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నారు. అటు, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖలో 'న్యాయ సాధన సభ' పేరిట నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు షర్మిలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరం చేసేలా షర్మిల నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

'ప్రజాగళం' సభపై విమర్శలు

కాగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 'ప్రజాగళం' సభపై షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు చంద్రబాబును, ఇటు జగన్ ను 2 పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తోన్న రింగ్ మాస్టర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అంటూ ఆమె నిప్పులు చెరిగారు. 'కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని ప్రధాని మోదీ కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగిందెవరు. వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది బీజేపీ. ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో,? దత్తపుత్రుడు అన్నది ఎవరినో.?' అంటూ సెటైర్లు వేశారు. 

సీఎం జగన్ పై విమర్శలు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు అని ఆరోపించారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. 'హామీలు ఇచ్చింది కాంగ్రెస్, వాటిని తుంగలో తొక్కింది బీజేపీ, టీడీపీ, వైసీపీ. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రస్ మీద పసలేని దాడులు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్‌కు మీరు భయపడుతున్నారా.?' అని బీజేపీని వైఎస్ షర్మిల నిలదీశారు. 

Also Read: APPSC Group1 Prelims: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' పరీక్ష ప్రశాంతం, ప్రిలిమ్స్‌కు 72.55 శాతం అభ్యర్థులు హాజరు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Embed widget