అన్వేషించండి

ద్వితీయ శ్రేణికి దారేదీ? పార్టీల్లో కొర‌వ‌డుతున్న కొత్త నెత్తురు!

గ‌తంలో రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించి నాయ‌కుల కొర‌త వ‌చ్చిన‌ప్పుడు.. కొత్త‌ వారికి అవ‌కాశాలు ద‌క్కేవి. అది కూడా సుదీర్ఘ‌ కాలంలో జెండా మోసిన వారికి అవ‌కాశం అందేవి. కానీ, ఇప్పుడు దిగుమ‌తి పెరిగి పోయింది.

Youth leaders in Politics: వ్య‌వ‌సాయం(Agriculture) మాదిరిగానే రాజ‌కీయాల‌(Politics)లోనూ కొత్త వారు, ముఖ్యంగా చదువుకున్న‌ యువత(Youth) పెద్ద‌గా రావ‌డం లేదు. వ‌చ్చినా..ఎక్కువ కాలం మ‌న‌లేక పోతున్నారు. అసలు ఇప్పుడున్న రాజ‌కీయాల్లో యువ‌త ప్రాధాన్యం కేవ‌లం జెండాలు మోసేందు, జేజేలు కొట్టేందుకే అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రోవైపు.. దేశంలో యువ శ‌క్తి(Youth) పెరుగుతోంద‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఆమేర‌కు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న యువ‌త పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీనికి రాజ‌కీయ పార్టీలు ప్రోత్స‌హించ‌క‌పోవ‌డం.. అదేస‌మ‌యంలో ధ‌న ప్ర‌వాహం.. వంటివి ప్ర‌ధాన అవ‌రోధాలుగా మారాయ‌ని నిపుణులు(Experts) చెబుతున్నారు. స్వాతంత్య్రోద్య‌మ కాలంలో ఏ నాయకుడైనా మ‌హాత్మా గాంధీ (Mahatma Gandhi)ని క‌లిసినా.. లేక ఆయ‌నే ఎక్క‌డైనా ప‌ర్య‌టించినా.. ``ఈ నెల‌లో ఎంత మంది కొత్త‌వారిని ఉద్య‌మంలోకి తీసుకువ‌చ్చారు?`` అని అడిగి మ‌రీ కొత్త‌వారికి ప్రాధాన్యం ఇచ్చేవారు.

దీంతో స్వాతంత్య్రోద్య‌మ(Freedom Fight) మ‌లి సంధ్య యువ‌తీ యువ‌కుల‌తో నిండిపోయింది. ఇక‌, ఇప్పుడు మ‌న పాల‌న‌మీద మ‌నమే ఉద్య‌మాలు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది వేరే సంగ‌తి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఎక్కువ‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌వ్యాప్తంగా పుట్ట‌గొడుగుల్లాఅనేక పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కానీ, ఏ పార్టీని చూసినా.. యువ‌త‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. పైకి ఇస్తున్నామ‌ని.. యువ‌త పాత్రే కీల‌క‌మ‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో ఆమేర‌కు మెరుపు క‌నిపించ‌డం లేదు. దీంతో చ‌దువుకున్న యువ‌త రాజ‌కీయాల వైపు రావ‌డం మానేశారు. ఫ‌లితంగానే రాజ‌కీయ అవినీతి పెరుగుతోంద‌నే వాద‌న కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. 

సీనియ‌ర్ల‌కే పెద్ద‌పీట‌!

పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. అధినేతలకు ఎంత సీనియారిటీ ఉన్నా.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హిస్తున్న ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇటు అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో అయినా.. ప్ర‌తిప‌క్ష టీడీపీలో అయినా.. నాలుగున్న‌రేళ్లుగా.. జెండాలు మోసిన వారు.. జేజేలు కొట్టిన వారు ఉన్నారు. దీనికి కార‌ణం.. త‌మ‌కు కూడా గుర్తింపు వ‌స్తుంద‌ని. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఉంటే.. ఆయ‌న వెనుక తిరిగిన వారిలో కీల‌క‌మైన నాయ‌కులు ఒక‌రిద్ద‌రు ఖాయంగా ఉంటారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది. అదేస‌మ‌యంలో కేవలం ఎమ్మెల్యేకు మాత్రం ప‌రిమితం కాకుండా.. పార్టీ కోసం ప‌నిచేసిన యువ‌త‌రం.. ద్వితీయ శ్రేణి నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరంతా కూడా.. పార్టీల అభ్యున్న‌తిని కోరుతున్న వారే. ఏదైనా చిన్న అవ‌కాశం రాక‌పోతుందా? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్న వారే. అయితే.. వీరికి ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌ధాన పార్టీల నుంచి ఊరింపులు.. ఊర‌డింపులు త‌ప్ప ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేసే అవ‌కాశాలు మాత్రం క‌నుమ‌రుగవుతున్నాయి. 

యువ‌త‌కు ఛాన్స్ ఇస్తే.. 

మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీట్లు ఆశించిన ద‌క్క‌నివారు లేదా.. పొరుగు పార్టీలు బ‌లంగా ఉన్నాయ‌ని న‌మ్ముతున్న వారు. పార్టీలు మారుతు న్నారు. దీంతో పార్టీల‌కు కొన్ని కొన్ని చోట్ల నాయక‌త్వాలు క‌రువ‌వుతున్నాయి. ఇలాంటి స్థానాల్లో ఎప్ప‌టి నుంచో పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌వారిని, యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పిస్తే.. వారి ద్వారా.. కేడ‌ర్ పుంజుకునే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా పార్టీ కూడా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండేది. ఏదైనా కార‌ణంగా ఒక ఎమ్మెల్యే జంప్ చేస్తే.. ఆ స్థానంలో అదే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయ‌కుడిని వెతికి ప‌ట్టుకుని అవ‌కాశం క‌ల్పించారు. త‌ద్వారా.. నాయ‌కుల‌ను పెంచుకున్న సంస్కృతి  ఉండేది. దీంతో కాంగ్రెస్(Congress), క‌మ్యూనిస్టు(Communists) పార్టీలు అప్ప‌ట్లో చాలా బ‌లంగా ఉండేవి. అంతేకాదు.. అన్న‌గారు ఎన్టీఆర్(NTR) కూడా.. పొరుగు పార్టీల నుంచి వ‌చ్చిన వారికి టికెట్ ఇచ్చే విష‌యంలో చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. కానీ, ఇప్పుడు పొరుగు పార్టీల నేత‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టుగా.. సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్న ప‌రిస్థితి లేదు. ఇది వైఎస్సార్ సీపీలోనూ.. టీడీపీలోనూ కామ‌న్‌గా క‌నిపిస్తున్న ఫ్యాక్ట‌ర్‌. 

33 శాతం ఇస్తామ‌న్న టీడీపీ!

ఓ రెండేళ్ల కింద‌టికి వెళ్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు(Nara Chandrababu naidu).. త‌మ పార్టీలోనూ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోనూ 33 శాతం(33%) అవ‌కాశాలు యువ‌త‌కు ఇస్తామ‌ని ఒంగోలులో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌గా చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో యువ శ‌క్తి పెరుగుతోంద‌ని.. దానిని రాజ‌కీయంగా కూడా మ‌లుచుకుని ప్ర‌జాసేవ వైపు వారిని మ‌ళ్లిస్తామ‌న్నారు. కానీ, ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి.. సాధ్యంకావ‌డం లేదు. ఇక‌, వైఎస్సార్ సీపీ(YSRCP)లోనూ, భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP)లోనూ.. ఇదే పోక‌డ క‌నిపిస్తోంది. పైకి ప్ర‌స్తావిస్తున్న‌ యువ మంత్రం.. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. గ‌త ఏడాది తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ క‌లిపి(కాంగ్రెస్‌, భార‌త రాష్ట్ర స‌మితి, బీజేపీ) యువ‌త‌కు ఇచ్చిన సీట్ల సంఖ్య‌, అందునా కొత్త త‌రానికి ఇచ్చిన సీట్ల సంఖ్య 2 శాతం లోపేనంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. 

దేశంలోను, రాష్ట్రాల్లోనూ యువ‌త సంఖ్య పెరుగుతున్న ద‌రిమిలా.. వారికి ఉద్యోగ , ఉపాధితోపాటు.. రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పిస్తే.. యువ ర‌క్తం రాజ‌కీయంగా ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా.. అవినీతి, అక్ర‌మాల‌కు కొంతైనా అడ్డుకట్ట‌ప‌డుతుంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అయినా.. ఈ మేర‌కు పార్టీలు ఆలోచ‌న చేస్తాయేమో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget