అన్వేషించండి

Amanchi Krishnamohan : ఆమంచి కృష్ణమోహన్‌కు దారేది ? వైసీపీలో ఇక టిక్కెట్ ఇవ్వరా ?

Amanchi Krishnamohan : ఆమంచి కృష్ణమోహన్ ను జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టారు ? చివరి క్షణంలో పార్టీ మారిపోతారని అనుకున్నారా ? చీరాల టిక్కెట్ ఖరారు చేస్తారా ?

Why did Jagan Mohan Reddy sideline Amanchi Krishnamohan  : వైఎస్ఆర్‌సీపీ ఏడో జాబితాలో రెండే పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పర్చూరు ఇంచార్జ్‌గా ఎడం బాలాజీ అనే నేతను నియమించడం. ఆ నియామకం కాదు ఆశ్చర్యకరమైన విషయం.. ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించడం .. ఆయనకు మరో నియోజకవర్గం చూపించకపోవడమే వైసీపీ వవర్గాను సైతం ఆశ్చర్య పరిచింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఆయనకు ఈ విషయంలో ముందే చెప్పారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. 

అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరిన యడం బాలాజీ 

పర్చూరుకు వైసీపీ ఇంచార్జ్ గా నియమితులై యడం బాలాజీ టీడీపీ నేత. 2014లో వైసీపీ తరపున  చీరాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. తర్వాత యడం బాలాజీ టీడీపీలో చేరారు. కానీ ఆయన యాక్టివ్ గా లేరు. ఇటీవలి కాలంలో ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు పర్చూరు కోసం అభ్యర్థిని వెదికిన వైసీపీ పెద్దలు యడం బాలాజీని అమెరికా నుంచి పిలిపించారు. ఆయన రెడీగా ఉండటంతో పర్చూరు ఇంచార్జ్ గా ప్రకటించారు. ఇలా ప్రకటనకు ముందు బాలాజీ క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను కలిశారు. ఆ సమయంలో ఆమంచి కృష్ణమోహన్ లేరు. అందుకే ఈ చేరికలపై ఆమంచికి సమాచారం లేదని అంటున్నారు. 

చీరాలలో పోటీ  చేయాలనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ 
 
చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు పోటీ చేయడం ఇష్టం లేదు.  గతంలో టీడీపీలో ఉండే ఆయన  2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన సంతోషంగా ఉండలేకపోయారు.   టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో జగన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్నది ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అక్కడ కుదురుకునే పరిస్థితి లేదని తేలడంతో  ఆయన చీరాలపైనే దృష్టిపెట్టారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడయ్యారని చెబుతున్నారు. ఇటీవల చీరాలలో ఆయన అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించారని అంటున్నారు. పర్చూరులోనే పోటీ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినకపోవడంతో  సీఎం జగన్ కొత్త అభ్యర్థిని చూసుకున్నారని అంటున్నారు. 

ఇప్పుడు ఆమంచికి దారేది ? 

ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. ఆయన చీరాల ఫలితాన్ని తేల్చగలరు. ఆయనను సీఎం జగన్ వదులుకోరని వైసీపీ వర్గాలు  భావిస్తున్నాయి. చీరాలలో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తారని అంటున్నారు. చీరాలలో కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయాలనుకుంటున్నారు. వారిని కాదని ఆమంచికి ఇస్తారా అన్న సందేహం ఉంది. ఒక వేళ వైసీపీలో టిక్కెట్ రాకపోతే ఆమంచి  జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు.  ఇప్పుడు ఆమంచి ఏం చేయబోతున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ఆయన పార్టీ మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Krishna Last Film: కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
Hyderabad Crime News: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Embed widget