అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kuppam Politics : వైఎస్ఆర్‌సీపీ టార్గెట్ కుప్పం - చంద్రబాబును బలహీనం చేసే మిషన్‌లో దాడులు వ్యూహం ఫలించిందా ?

కుప్పం చుట్టూ వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. చంద్రబాబు సంప్రదాయ రాజకీయాల్ని.. దాడులు.. కేసులతో ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ముందడుగు వేసిందా ?

Kuppam Politics :  మాజీ సీఎం, టీడీపీ  అధినేత చంద్రబాబు కుప్పం  మూడురోజుల పర్యటన ఉద్రికత్తల మధ్య ముగిసింది. వైసీపీ శ్రేణుల నిరసనలు, ధర్నాలతో సొంత నియోజకవర్గంలో చంద్రబాబు సాగించిన పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. అన్నా క్యాంటీన్‌ ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబుని మట్టుబెట్టడం  జగన్‌ కి పెద్ద విషయం కాదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకుముందు మాజీ సిఎం చేత కన్నీరు పెట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్డు మీద కూర్చోనేలా చేశారన్న విమర్శలు వినిపించాయి. కుప్పంలో మూడురోజుల పర్యటన టిడిపి-వైసీపీ నేతల బలాబలాలకు వేదికగా మారడంతో రకరకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో హడావుడి చేశాయి.

చంద్రబాబు టూర్‌లో ముందస్తు వ్యూహం ప్రకారం గలాటా !

వయసులో పెద్దవారు, 40 ఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ, మాజీ సిఎం అని లేకుండా చంద్రబాబుని ఈ రకంగా జగన్‌ అవమానించడాన్ని ఆ పార్టీ అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే బాబు విసిరిన డైలాగ్‌ ని  సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఉత్తరకొరియాలో కిమ్‌ మాదిరి మనకు ఇక్కడ జిమ్‌ ఉన్నాడని చంద్రబాబు చివరి రోజు పర్యటనలో విమర్శించారు. ఈ నేరస్తుల పాలన ఎన్నో రోజులు ఉండదని హెచ్చరిస్తూ ఖబడ్దార్‌ జగన్‌ రెడ్డి అని ఆవేశపడ్డారు. ఇలా చంద్రబాబు మూడురోజుల పర్యటనంతా హాట్‌ హాట్‌ గా సాగడంతో బాబు గారి ఆవేశం..ఆవేదనని ..ఆక్రోశాన్ని చూడంటంటూ వైసీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో రివర్స్‌ ఎటాక్‌ కి దిగాయి. ఇటు ఏపీ సిఎం ఈ వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. విశాఖలో ప్లాస్టిక్‌ తో పార్లే తయారు చేసిన వస్తువులను ఆసక్తికరంగా తిలకించడమే కాకుండా కళ్లజోడుని పెట్టుకొని సరదాగా తిరిగారు. ఇక సభా వేదికపై కూడా ఆ కళ్ల జోడుని పెట్టుకొని అందరి చేత నవ్వించారు.  

అన్నా క్యాంటీన్ ధ్వంసంతో  వైఎస్ఆర్‌సీపీపై నెగెటివ్ ప్రచారం

అన్నా క్యాంటిన్ ఏర్పటు చేసి చంద్రబాబు చేత ప్రారంభించేందుకు సిద్దం చేస్తే..అన్నా క్యాటిన్ ను కూల్ఛీ వేసి అడ్డుకొనేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై రాళ్ళ దాడికి దిగారు.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే అడ్డుకున్నం, దాడి చేశాం  ఇక మీరేంత అన్న సంకేతాన్ని మిగతా నాయకులకు ఇచ్చేందుకే తెగబడ్డారని టీడీపీ పార్టీలో చర్చ నడుస్తుంది.. జడ్ ప్లస్ బద్రతా క్యాటగిరి లో ఉన్న   చంద్రబాబు పై దాడి చేసేం... ఇక మేము తలచుకుంటే మీరెంత‌ అన్న సంకేతం ఇవ్వడంలో వైసీపీ సక్సెస్ అయిందని భావిస్తున్నారు.  టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులలో‌ మనోదైర్యం నింపేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది...వైసీపీ నాయకులు ద్వంసం చేసిన అన్న క్యాంటిన్ కు కూత వేటు దూరంలో పోలీస్టేషన్ ఉన్న వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పపట్టారు.గంటల‌ వ్యవదిలో‌ అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేయించి ప్రారంభించడమే కాకుండా స్వయంగా తానే  వడ్డనలో  పాల్గొని క్యాడర్ కు నేనున్నాను అని దైర్యం నింపారు...దాడులకు తాను, తన పార్టీ శ్రేణులు భయపడటం లేదని అధికార పార్టీకి సంకేతం ఇచ్చారు...

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలకు .. తమదైన కౌంటర్ ఇస్తున్న వైఎస్ఆర్‌సీపీ

గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతల‌ నియోజకవర్గంలో పెద్దగా అధికాపక్షం ఫోకస్ పెట్టేది కాదు..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి మారిపోయింది... మొదటి హార్డిల్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పాన్ని టార్గెట్ చేసింది సీయం జగన్ వర్గం.... ప్రతిపక్ష నాయకుడి‌‌ ఇలాకాలో అతని పార్టీ శ్రేణులను భయబ్రంతులకు లోను చేసి ...కేసులు, బౌతిక దాడుల‌ ద్వారా వారిలోనే అభద్రతా భావం సృష్టించి భయపడి పార్టీ మారడమే లేకపోతే సైలట్‌ అయ్యే విధంగా   ప్రణాళికాలను సిద్దం చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు.. టీడీపీ ప్రధన నాయకుడు చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పంలో క్యాడర్ ను కకలవికలం చేయడమే‌‌ లక్ష్యంగా పెట్టుకొన్నారు అధికాపార్టీ నాయకులు.. 

కుప్పం ప్రజల్లో శాంతిభద్రతలపై ఆందోళన- టీడీపీ క్యాడర్‌లో భయం

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా వరసగా ఏడు సార్లు కుప్పం నుంచి విజయం సాధించారు చంద్రబాబు... ఇక్కడ టీడీపీ క్యాడర్ను బలహీన పరిచేందుకు సామ,ధాన, వేదాలు అయిపోయాయి...అయిన మార్పు రాలేదు... అందుకనే దండోపాయాన్ని ప్రయేగించారు...పార్టీ అద్యక్షుడు చంద్రబాబు పర్యటన రోజు నుంచి ప్లక్సీలు, చించడం,గొడవ పడటం, చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళు వేయడం ద్వారా కొంత సంకేతాన్ని పంపారు...చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే  పార్టీ శ్రేణులకు రక్షణ లేదని తెలియ చెప్పడం...ఆలాంటిా సమయంలో మీకు ఏమి రక్షణ ఉంటుదో ఆలోచించుకోనే పరిస్తితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులలో కలిగించడం...మీకు మరో ఆప్షన్ లేదు పార్టీ మారడమే శరణ్యం అన్న సంకేతం ఇవ్వడం...కుప్పంలో సాంప్రదాయ ಓట్ బ్యాక్ ను కూడా తమ పార్టీ వైపు మలచుకొని చంద్రబాబును ಓడించటమే ఏకైక లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. చంద్రబాబు పర్యటన ముగిసిన గంటల‌ వ్యవధిలోనే టీడీపీ నాయకులపై నిరాధారమైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు వైసీపీ వ్యూహంను ఏ‌‌విధంగా ఎదుర్కుంటారో చూడాలి..!
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget