అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడు ఫలితాల తర్వాత అన్నీ సిత్రాలే - తెలంగాణ రాజకీయంలో సమూల మార్పులు ఖాయం ! ఎవరికి అడ్వాంటేజ్ ?

మునుగోడు నేతల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి. వారి జాతకాలు ఉప ఎన్నికల ఫలితాలే డిసైడ్ చేయనున్నాయి. 6న ఉదయం 11 గంటల కల్లా ఫలితం అప్పటి వరకూ నేతలకు టెన్షన్ తప్పదు. 

Munugode Bypoll :  గెలవాలి ..గెలవాలి..ఇప్పుడిదే అన్నిపార్టీల జెండా..ఎజెండా కూడా. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడమే ప్రధాన పార్టీలకే కాదు తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నపార్టీలకు కూడా కీలకంగా మారింది. అయితే ఈసారి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలను బెంబేలిత్తిస్తోంది ఏంటి ? ఏఏ విషయాలు గుండెచప్పుళ్లని పెంచేస్తున్నాయి ? ఫలితాల ప్రభావం ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి ?  అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలన్నీ ఓ ఎత్తు అయితే మునుగోడు ఉప ఎన్నిక మరో లెవల్‌. సింపుల్‌ గా చెప్పాలంటే పార్టీలు భావిస్తున్నట్లు ఈ ఉప ఎన్నిక గెలుపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిది..ఏ పార్టీ నిలబడుతంది అన్నది నిర్ణయించబోతోంది. ప్రధాన పార్టీలకే కాదు రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనుకుంటున్న చిన్నా చితకా పార్టీలకు, అభ్యర్థులకు ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది. 

మునుగోడు ఫలితం మార్చనున్న రాజకీయ పార్టీల జాతకం !

ప్రధాన పార్టీలైన బీజేపీ- టీఆర్‌ ఎస్‌- కాంగ్రెస్‌ లకు ఫలితం ఎలా వచ్చినా ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. అధికార పార్టీ గెలిస్తే బీఆర్‌ ఎస్‌ పార్టీ జాతీయరాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగే ఛాన్స్‌ ఉంటుంది. టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ గా రూపొంతరం చెందుతున్న తరుణంలో జరిగిన చివరి ఎన్నికలు కాబట్టి ఇక్కడ గెలిస్తే దీని జోష్ దునియాంత చూపించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం చూస్తోంది. బీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నికల గెలుపు ఒక గిఫ్ట్ కాబోతుందని మంత్రి పువ్వాడ అజయ్ ఏబీపీ దేశంతో అన్నారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్ అయితే 30 నుంచి 40 వేల మెజార్టీ తప్పక వస్తుందని ఏబీపీ దేశంతో చెప్పారు. గెలుపు పై నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలిస్తే ముందుస్తు ఎన్నికలకు పోతారా? లేక ఇన్ టైంకే ఎన్నికలు జరగుతాయా? అనేది కూడా చర్చ జరుగుతుంది. ఒక వేళ  ఓడితే రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం తప్పకుండా ఉండే అవకాశం ఉంది. 

ఉపఎన్నిక తెచ్చిన బీజేపీకి లిట్మస్ టెస్ట్ 

అలాగే బీజేపీ గెలిస్తే తెలంగాణలో అధికారం అందుకోవాలన్న లక్ష్యానికి చేరువ అవుతామని అనుకుంటోంది. మునుగోడులో గెలిస్తే మరింత బూస్టింగ్ వస్తుంది. రేసు లో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తెలంగాణలో ప్రస్తుతానికి రెండో ప్లేస్ లో తాము ఉన్నామనీ, రేపు సాధారణ ఎన్నికల్లో గెలిచి నెంబర్ వన్ కు చేరుకోగలమని కమలం నేతలు అశపడుతున్నారు. మునుగోడు చేసిన ఎక్సపర్మెంట్ వర్క్ అవుట్ అవుతుందనే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారాలనుకుంటున్న గులాబీ నేతలు కారు దిగుతారనీ, హస్తాన్ని వదిలి కమలం పువ్వును చేతిలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. క్యూలో ఉన్నవారు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే  ఓడితే నష్టం భారీగా ఉండే అవకాశంతో పాటు ఆకర్ష్‌ లో భాగంగా బలమైన నేతల వలసకు బ్రేక్‌ పడే ఛాన్స్‌ ఉంది. అంతేకాదు బీజేపీ ది బలమా? వాపా అనేది కూడా మునుగోడు ఫలితంతో తేలే అవకాశం లేకపోలేదు. అంతేకాదు మునుగోడు ఫలితం తారుమారైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాటలతో బీజేపీ ని ఆడుకునే అవకాశం లేకపోలేదు. గులాబీ పార్టీ నేతల విమర్శలకు చెక్ పెట్టడం కూడా కమలం పార్టీకి కష్టమయ్యే అవకాశం ఉంది. 

రేసులో ఉండాలంటే కాంగ్రెస్ గెలిచి తీరాల్సిన పరిస్థితి..!

ఇక కాంగ్రెస్‌ కి ఈ గెలుపు  అనివార్యం కానుంది. తెలంగాణ తెచ్చింది-ఇచ్చింది మేమేనని చెప్పుకున్నా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బలమైన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్‌ నిలవలేని స్థితిలో ఉంది. ఓ రకంగా బీజేపీనే బలంగా ఎదుగుతోంది కానీ కాంగ్రెస్‌ మాత్రం రోజురోజుకి బలహీనపడుతోంది. కాబట్టి పార్టీని బతికించాలన్నా, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలన్నా, వలసలను ఆపాలన్నా ఈ మునుగోడు ఉప ఎన్నిక విజయం తప్పనిసరిగా మారింది. గెలుపు దిశగా కాకపోయిన కనీసం రెండో స్థానం లేదా భారీ ఓటింగ్ అయిన జమ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. 

చిన్నా చితకా పార్టీల ప్రభావం ఎంత? 

అయితే ఈ మూడు పార్టీలకు టెన్షన్‌ రేపుతోంది మాత్రం చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీఎస్పీ  ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. బీఎస్సీ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కు కూడా ప్రజల్లో ఆదరణ బాగుంటుండంతో ఈ ప్రభావం తప్పకుండా రాజగోపాల్‌ రెడ్డి, పాల్వాయి స్రవంతి, ప్రభాకర్‌ రెడ్డిలపై ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు అందుకున్న ఓట్లకు ఈసారి అభ్యర్థులు అందుకోబోయే ఓట్లకు చాలా తేడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇండిపెండెంట్లు ఎవరికి గండంగా మారారు? 

చిన్నాచితకా పార్టీలే కాదు ఈసారి స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిగారు. 47మంది స్వతంత్రులు ప్రధానపార్టీల అభ్యర్థులకు పోటీ ఇచ్చారు.  అంతేకాదు కొన్ని గుర్తులు ప్రధానపార్టీల గుర్తులను పోలి ఉండటం కూడా ఆయా పార్టీలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్‌ రోలర్‌ గుర్తు టీఆర్‌ ఎస్‌ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఎన్నికల ఫలితాల్లో ఈ గుర్తు నాలుగో స్థానంలో నిలిచి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించింది. దాదాపు రెండు శాతం ఓట్లని కైవసం చేసుకుంది. ఇ ప్పుడు కూడా ఈ రోడ్‌ రోలర్ గుర్తు ఓట్లని ఎంతవరకు చీల్చుతుందోనన్న టెన్షన్‌ కారు పార్టీని కంగారు పెట్టిస్తోంది. అలాగే నోటా కూడా తప్పకుండా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో 5వ స్థానంలో నిలిచిన నోటా దాదాపు మూడు వేలకు పైగా ఓట్లను అందుకుంది. ఇప్పుడు కూడా ఈ నోటా ఓట్ల శాతం పెరిగే అవకాశాలు లేకపోలేదన్న టాక్‌ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన నోటా గుర్తుపై ప్రజలకు అవగాహన బాగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

ఫలితాల రోజున అసలు మ్యాజిక్ !

ఈ రకంగా కాంగ్రెస్‌-బీజేపీ-టీఆర్‌ ఎస్‌ ల గెలుపుకు స్వతంత్ర్య అభ్యర్థులు, చిన్నాచితకాపార్టీలు అడ్డుగోడగా నిలవడమే కాదు ఓటింగ్‌ శాతాన్ని కూడా తగ్గించడం ఆయాపార్టీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మునుగోడు ఫలితాలు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి. మూడు ప్రధాన రాజకీయపార్టీల జాతకాల్ని మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే డిసైడ్ చేయనున్నాయి. నవంబర్ 6న ఉదయం 11 గంటల కల్లా ఫలితం తేలిపోయే అవకాశం ఉంది. అప్పటి వరకూ నేతలకు టెన్షన్ తప్పదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget