అన్వేషించండి

Telangana BJP : బీజేపీ హైకమాండ్‌కు కొరుకుడుపడని తెలంగాణ బీజేపీ - అధ్యక్షుడ్ని ఎందుకు పైనల్ చేయలేకపోతున్నారు ?

BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరుగుతుందోనని ఆ పార్టీ క్యాడర్ ఎదురుచూపుల్లో గడిపేస్తున్నారు. కిషన్ రెడ్డికి ఢిల్లీ బాధ్యతల కారణంగా దృష్టి పెట్టలేకపోతున్నారు.

When will Telangana BJP president be appointed : తెలంగాణ బీజేపీ చుక్కాని లేని నావలా నడుస్తోంది.  బండి సంజయ్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆయనను తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. అప్పుడూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రే.. ఇప్పుడూ కేంద్రమంత్రే. ఆయన అప్పట్నుంచి  పార్టీని పట్టించుకోలేకపోతున్నారు. మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి , బండి సంజయ్ ప్రమాణాలు చేశాక కొత్త అధ్యక్షుడు వస్తారేమో అనుకన్నారు. కానీ నెలలు గడుస్తున్నా హైకమాండ్ అధ్యక్షుడ్ని నియమించలేకపోయింది. పార్టీ కూడా స్తబ్దుగా మారిపోయిది. ఈ క్రమంలో అంతర్గత కలహాలు మాత్రం మీడియాకు ఎక్కుతున్నాయి. 

పార్టీ పనితీరుపై ధర్మపురి అర్వింద్ బహిరంగ అసంతృప్తి 

గ్రేటర్‌లో 48 కార్పోరేటర్ సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటే ఎందుకు గెలిచిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గళమెత్తడం బీజేపీలో సంచలనం అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనుకున్న పరిస్థితి నుంచి బీజేపీ 8 సీట్లకే   పరిమితవడానికి కారణం ఏమిటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని ాయనంటున్నారు. ఆయన ఎవరిని టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. మరో నేత   ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఆఫీసులో కాకుండా  ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు.  పార్టీ కార్యాలయం, అసెంబ్లీ ఎల్పీలో ఆయనకు చాన్స్ ఇవ్వలేదని అందుకే ప్రెస్ క్లబ్‌లో పెట్టారని చెబుతున్నారు.  

స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం గట్టి పోటీ 

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్, డీకే అరుణ తదితరులు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు గడిచి దాదాపు 10 నెలలు అవుతున్నా  కొత్త అధ్యక్షుడిని నియమించికపోవడంతో పార్టీల్లో స్తబ్దత ఏర్పడింది.  ఏకాభిప్రాయం కుదరకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతోంది.  మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సమయం ఇవ్వడం సాధ్యం కావడం లేదని.. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది.  పార్టీ నాయకత్వం మార్చే వరకు బీజేపీలో విభేదాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.హైకమాండ్ కు చెందిన వ్యక్తులు పలుమార్లు తెలంగాణ పర్యటనకు వచ్చినా ఓ నాయకుడ్ని ఖరారు చేయలేకపోయారు. 

Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు

నిజానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఈటల రాజేందర్ ను అధ్యక్షుడిగా ప్రకటించడానికి రంగం సిద్ధమైపోయిందని అనుకున్నారు. కానీ అదంతా తేలిక కాదని వెంటనే అర్థమైపోయింది. ఆయనకు వ్యతిరేకంగా బలమైన లాబీనే ఉందని స్పష్టమయింది. మల్కాజిగి టిక్కెట్ ఆయనకు రాకుండా చాలా మంది ప్రయత్నించారు. అయితే బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన టిక్కెట్ తెచ్చుకోగలిగారు. బీసీ సీఎం నినాదం కూడా ఈటలే ఇప్పించారని అంటారు. అంతగా తనపై నమ్మకం పెట్టుకున్న  హైకమాండ్ .. తనకు చీఫ్ గా చాన్స్ ఇస్తుందనిఅనుకుంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. అందుకే ఆయన బీజేపీ పేరుతో కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా బీజేపీ ఎంపీగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. మూసీ విషయంలో ఆయన సొంతంగానే పర్యటించారు. 

స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా త్వరలో అధ్యక్షుడ్ని నియమించాలని బీజేపీ క్యాడర్ కూడా కోరుకుంటోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget