అన్వేషించండి

Elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న ముహుర్తం-కాంగ్రెస్ ఈ సారైనా ఊపిరి పీల్చుకుంటుందా?

Five State elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ..ఈసీ సన్నాహాలు దాదాపుగా పూర్తి చేసింది. ఈ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలను మార్చనున్నాయి.

Five States assembly elections:    పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే మాూడు నెలల్లో జరగనున్నాయి. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని అనుకున్న  రాష్ట్రాల్లో కూడా ఓడిపోతోంది. రాను రాను ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇలాంటి సమయంలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖాముఖి, కూటములుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, ఈ ఎన్నికలు ఆ పార్టీ ఉనికికి ,ప్రతిపక్ష కూట  ఐక్యతకు అగ్నిపరీక్షగా మారాయి.  
 
పశ్చిమ బెంగాల్ - దీదీ అధికారాన్ని నిలబెట్టుకోగలరా?

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తన సంక్షేమ పథకాలు , బెంగాలీ అస్తిత్వంపై నమ్మకం పెట్టుకోగా, ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి ఆరోపణలను బీజేపీ తన ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం టీఎంసీ-బీజేపీ మధ్యే ఉండేలా కనిపిస్తోంది. ముస్లిం ఓట్ల సమీకరణ ఇక్కడ గెలుపోటములను శాసించనుంది. మమతా బెనర్జీ ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కూడా గెలిచి చూపిస్తామన్న ధీమాతో ఉంది. 

ద్రావిడ కోటలో కొత్త శక్తుల సందడి 

తమిళనాడులో అధికార డీఎంకే కూటమి బలంగా ఉన్నప్పటికీ, నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం  రాకతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అన్నా డీఎంకే  తన కోల్పోయిన వైభవాన్ని చాటుకోవాలని చూస్తుంటే, బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ డీఎంకేపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే ఈసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌కు ఇది సవాలుగా మారింది. త్రిముఖ పోరులో డీఎంకేకు లాభం కలుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. 

 కేరళ: ఎల్‌డిఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా?  

సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది, కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఎల్‌డిఎఫ్ చూస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్  కి ఇది చావో రేవో లాంటి ఎన్నిక. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోతే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అటు బీజేపీ కూడా క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకుంటూ ఇక్కడ బలపడాలని చూస్తోంది. ప్రియాంకా గాంధీ వాయనాడ్ నుంచి ఎంపీగా ఉండటంతో  గెలుపు సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. 

 అసోం: బీజేపీ హ్యాట్రిక్ ప్రయత్నం 

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అభివృద్ధి ,  హిందుత్వ నినాదాలతో బీజేపీ మూడోసారి అధికారంపై కన్నేసింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. పైగా కీలక నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఏఐయుడిఎఫ్ వంటి పార్టీలతో పొత్తులు కుదిరితేనే కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే బీజేపీకి మార్గం సుగమం అవుతుంది.

 పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతంలో పట్టు కోసం పోరు 

పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ , బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది, కానీ నేతల వలసలు ఆ పార్టీని బలహీనపరిచాయి. ఇక్కడ కూడా డీఎంకే మద్దతుతోనే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, ఇక్కడ గెలుపు కేంద్రంలోని అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం.
 
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కేరళలో అధికారం దక్కించుకోలేకపోతే, ఆ పార్టీ కేవలం కొన్ని చిన్న రాష్ట్రాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు, బెంగాల్ ,  తమిళనాడులో ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డీఎంకేలు గెలిస్తే, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గి, మమతా బెనర్జీ , స్టాలిన్ వంటి నేతలు జాతీయ నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చనున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Embed widget