Money rain at Punjabi wedding:పెళ్లిలో డబ్బుల వర్షం - ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాంకే !
Punjabi wedding: పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లిలో వధూవరులపై నోట్ల వర్షం కురిపించారు బంధువులు. ఆ మొత్తం ఎనిమిదిన్నర కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు కానీ నాలుగు లక్షలేనని వారు చెబుతున్నారు.

Money rain at Punjabi wedding: పెళ్లిళ్లలో వధువరులపై డబ్బులు ఎగురవేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ అది చాలా స్వల్పంగానే ఉంటుంది. కానీ కొన్ని ధనవంతుల పెళ్లిళ్లలో మాత్రం ఊహించనంతగా ఈ ధనాన్ని చల్లుతూ ఉంటారు.
పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి మండపంపై వధువు నిలబడి ఉండగా, వరుడి కుటుంబ సభ్యులు ఆమెపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించిన వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. విలాసానికి పరాకాష్టగా నిలిచిన ఈ దృశ్యాలు చూసి చాలామంది ఇది కోట్ల రూపాయల భారీ ఖర్చు అని చర్చించుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు మరియు అతని బంధువులు పెద్ద పెద్ద బ్యాగుల నుంచి నోట్ల కట్టలను తీసి గాల్లోకి విసురుతూ కనిపించారు. ఎంతలా అంటే, కొద్దిసేపటికే ఆ పెళ్లి మండపం మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఈ స్థాయిలో నగదును విసరడం చూసి, సోషల్ మీడియాలో సుమారు రూ. 8.5 కోట్లు కురిపించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
🚨“Money Rain” at a grand Punjabi wedding! Guests watched in awe as sacks filled with cash — said to total ₹8.5 crore — were poured over the bride and groom during the celebrations.
— Bharat Observers (@BharatObservers) February 18, 2026
The spectacle has since gone viral online.
pic.twitter.com/1QBAoEunJX
అయితే, ఈ వైరల్ వార్తలపై వరుడి కుటుంబ సభ్యులు స్పందించారు. ఆస్ట్రేలియాలో ట్రక్ బిజినెస్ చేసే వరుడి సోదరుడు సికందర్ సింగ్ మాట్లాడుతూ.. తాము సంతోషంతో నగదు విసిరిన మాట వాస్తవమే కానీ, అది కోట్లలో లేదని స్పష్టం చేశారు. కేవలం రూ. 2 లక్షల వరకు మాత్రమే ఉంటుందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఈ వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, డీజే కూడా విసిరిన మొత్తం రూ. 4 లక్షల లోపే ఉంటుందని అంటున్నారు.
Punjabi Family Showers Rs 4 Lakh Notes on Bride at Wedding
— LocalTak™ (@localtak) February 18, 2026
40,000 ten-rupee notes emptied in celebration
CAPTION:
A Punjabi family in India created a viral "money rain" spectacle by throwing Rs 4 lakh in cash over the bride during her wedding. Bags filled with 40,000 ten-rupee… pic.twitter.com/1XkeVl2mvc
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని పంజాబీ సంస్కృతిలో భాగమైన ఆడంబరంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది డబ్బును అవమానించడమేనని విమర్శిస్తున్నారు. అంత డబ్బును పేదలకు లేదా సేవా కార్యక్రమాలకు ఇచ్చి ఉంటే బాగుండేదని సలహాలు ఇస్తున్నారు.























