అన్వేషించండి

Tamil Nadu Hung Politics: తమిళనాడులో బలహీన ప్రభుత్వమే - మూడేళ్లలో జమిలీ ఎన్నికలు ఖాయమా?

Tamil Nadu: ఎలా చూసినా తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న ప్రచారమూ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు మూడేళ్ల తర్వాత జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలనూ కొట్టి పారేయలేం.

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన  హంగ్ పరిస్థితులు కేవలం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన  జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేయిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ జమిలీ ఎన్నికల వ్యూహాలకు కలిసొచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఇప్పుడు  జోరుగా సాగుతున్నాయి. 

హంగ్ అసెంబ్లీ - అస్థిరతకు పునాది 

విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, సంపూర్ణ మెజారిటీకి దూరంగా ఉండటం రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు బీజం వేసింది. కేవలం కాంగ్రెస్ మద్దతుతో లేదా స్వల్ప మెజారిటీతో ఏర్పడే మైనారిటీ ప్రభుత్వం ఎంత కాలం నిలబడుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అన్నాడీఎంకే లేదా ఇతర పక్షాల మద్దతు లేకుండా ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందించడం విజయ్‌కు అతిపెద్ద సవాలుగా మారనుంది. ఈ అనిశ్చితి చివరికి అసెంబ్లీ రద్దుకు లేదా ముందస్తు ఎన్నికలకు దారితీసే ప్రమాదం ఉంది.

 2029 జమిలీ లక్ష్యం - కేంద్రం వ్యూహం 

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2029లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు వీలైనన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం గనుక మూడేళ్ల పాటు సాగి, ఆ తర్వాత కూలిపోతే లేదా రాజకీయ సంక్షోభం తలెత్తితే.. కేంద్రం తన జమిలీ ఎన్నికల ప్రణాళికలో తమిళనాడును చేర్చే అవకాశం ఉంటుంది. అంటే, రాష్ట్రంలో గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేసి 2029 పార్లమెంట్ ఎన్నికలతో కలిపే అవకాశం ఉంది. 

 విజయ్ పాలన - మూడేళ్ల గడువు? 

రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకురావాలని భావిస్తున్న విజయ్‌కు పాలనలో మొదటి అడుగు నుంచే సవాళ్లు మొదలయ్యాయి. ఒకవైపు ఆర్థిక భారం కలిగించే సంక్షేమ పథకాలు, మరోవైపు తన పార్టీ ఎమ్మెల్యేల వివాదాస్పద ప్రవర్తన విజయ్‌కు తలనొప్పిగా మారాయి. ఈ పరిణామాల మధ్య విజయ్ తన ప్రభుత్వాన్ని మూడేళ్ల పాటు సమర్థంగా నడపడమే ఒక గొప్ప విజయంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మూడేళ్ల తర్వాత మద్దతు ఉపసంహరణ లేదా ఇతర కారణాలతో ప్రభుత్వం పడిపోతే, అది నేరుగా 2029 జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుంది.

 బీజేపీకి కలిసొచ్చే అవకాశం 

తమిళనాడులో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి, ఇక్కడ నెలకొన్న హంగ్ పరిస్థితులు వరంగా మారే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను టీవీకే వైపు వెళ్లకుండా కట్టడి చేయడం లేదా సంకీర్ణంలో భాగం కాకుండా చూడటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని కొనసాగించడం బీజేపీ వ్యూహంలో భాగం కావచ్చు.   తమిళనాడు ఇప్పుడు ఒక ప్రయోగశాలగా మారింది. ఒక్కసారి ఎన్నికలు - ఐదేళ్ల పాలన  అనే సూత్రం ఇక్కడ దెబ్బతినడంతో, కేంద్రం జమిలీ ఎన్నికల నిబంధనలను ఇక్కడ అమలు చేసే అవకాశం మెండుగా ఉంది.  
 
  విజయ్ జయ కేతనం ఎగురవేసినా.. ఆయన పట్టాభిషేకం ముళ్లబాటలా మారింది. ఆయన ప్రభుత్వాన్ని మూడేళ్ల పాటు కాపాడుకోగలిగితే అది రాజకీయ అద్భుతమే అవుతుంది. లేనిపక్షంలో, 2029లో భారత్ చూసే తొలి భారీ జమిలీ ఎన్నికల్లో తమిళనాడు కూడా భాగస్వామి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget