By: ABP Desam | Updated at : 25 Aug 2023 06:33 AM (IST)
Edited By: jyothi
నారా లోకేష్ తో వంగవీటి రాధా భేటీ - పాదయాత్ర విరామ సమయంలో ప్రత్యేక సమావేశం
Vangaveeti Radha Meets Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో వంగవీటి రాధా ఏకాంతంగా భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలో లోకేష్ తో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటీవల యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా వరుసగా పాల్గొంటున్నారు. అయితే రాధా, లోకేష్ ఏకాంతంగా భేటీ అవ్వడంతో ఏం జరగబోతుందా అనే ఇతర పార్టీల నేతలు సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే వంగవీటి రాధ లాంటి నేతను ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ స్థానం నుంచి రాధా పోటీ చేయబోతున్నారో చర్చించినట్లు సమాచారం. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలోనే రాజకీయాలు చేస్తుంటారు. కానీ అక్కడ టీడీపీ తరఫున బొండా అమ అభ్యర్థిగా ఉన్నారు. ఇతర రెండు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారా అనే అంతా అనుకుంటున్నారు. విజయవాడలోనే కాకుండా కృష్ణా జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.
పాదయాత్రలో కొడాలి నాని, వంశీ చేస్తున్న కవ్వింపు చర్యల పై, సరైన చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా టిడిపి నేతలు#YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/9IojdYMXKw
— Telugu Desam Party (@JaiTDP) August 24, 2023
బాపులపాడు మండలం, రంగన్న గూడెంలో నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ నెలకొంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్న రోడ్డులోనే వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేగింది. బ్యానర్ పై వైసీపీ హయాంలో రెండు కోట్ల 71 లక్షలతో పనుల చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందు పరిచారు. ఇలా పాదయాత్ర జరుగుతున్న ఏరియాలో బ్యానర్లు వేయడాన్ని తెలుగు దేశం పార్టీ నేతలు తప్పు పట్టారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంసీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం చెరగేలింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసుల్ని మొహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
బాపులపాడు మండలం రంగన్నగూడెంలో లోకేష్ పాదయాత్రలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలు. వైసీపీ శ్రేణులను తరిమికొట్టిన తెలుగుదేశం కార్యకర్తలు..#GannavaramGaddaTDPAdda#LokeshinGannavaram#YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh… pic.twitter.com/6f1nJYVTn1
— Telugu Desam Party (@JaiTDP) August 24, 2023
Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Nara Brahmani : పొలిటికల్ కామెంట్లు చేస్తున్న నారా బ్రహ్మణి - రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లేనా..?
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
/body>