News
News
X

80 కోట్లతో విమానం- జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్ ప్లాన్

ద‌స‌రా రోజున టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంతోపాటు పార్టీ ముఖ్యనేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. అక్కడే పార్టీకి కొత్త పేరు ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

FOLLOW US: 
 
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ గురువారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ (ప్ర‌త్యేక విమానం) కొనుగోలు చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఇందు కోసం ఏకంగా రూ.80 కోట్ల‌ను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధ‌ప‌డింది. 12 సీట్ల‌తో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి ద‌స‌రా ప‌ర్వ‌దినాన ఆర్డ‌ర్ ఇవ్వనుందా పార్టీ. ఈ విమానం కొనుగోలుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను విరాళాల ద్వారా సేక‌రించాల‌ని కూడా ఆ పార్టీ తీర్మానించింది. ఈ క్ర‌మంలో విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేత‌లు పోటీ ప‌డుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే... సొంత విమానం క‌లిగిన రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌నుంది.

ద‌స‌రా రోజున (అక్టోబ‌ర్ 5) టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంతోపాటు పార్టీ ముఖ్యనేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే దేశ రాజ‌కీయాల్లోకి పార్టీకి ప్ర‌వేశం క‌ల్పిస్తూ పార్టీకి కొత్త పేరు ప్ర‌క‌టిస్తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప్ర‌త్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డ‌ర్ వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ ఖ‌జానాలో ఇప్ప‌టికే రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నా... విమానం కొనుగోలుకు మాత్రం విరాళాలు సేక‌రించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిరిగారు. ఆయన పాల్గొనాల్సిన సభలు ఎక్కువగా ఉండడంతో రోజుకి నాలుగు ఐదు చోట్ల కూడా హెలికాప్టర్లో వెళ్లారు అలా ఆయన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెబుతారు. కేసీఆర్ మాట వ్యవహార శైలి ఆయన వాడే పదాలు బహిరంగ సభల్లో అందరినీ ఆకట్టుకుంటాయనిది ఆ పార్టీ నేతల నమ్మకం. 

ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కెసిఆర్ బహిరంగ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని కార్మిక కర్షక వర్గాల నేతలు కలుసుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం ఈ ప్రత్యేక విమానం ఉపయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నేత ఇప్పుడు దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా సాధ్యమైనంత వరకు పెద్దకూటమినే తయారు చేయాలనే లక్ష్యంగా ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అత్యంత ధనిక పార్టీగా కూడా టిఆర్ఎస్ ఆవిర్భవించింది.

News Reels

Published at : 30 Sep 2022 10:04 AM (IST) Tags: TRS national party KCR News Flight

సంబంధిత కథనాలు

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

ఢిల్లీకి సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు- ప్రధానమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గోనున్న ఇరువురు నేతలు

ఢిల్లీకి సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు- ప్రధానమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గోనున్న ఇరువురు నేతలు

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!