అన్వేషించండి

Rahul Gandhi Action On Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ మొత్తం ప్రక్షాళన ఖాయం - పీసీసీ చీఫ్ మార్పు కూడా - రాహుల్ బ్లాస్ట్ కావడం ఖాయమేనా?

Meenakshi Natarajan Rajya Sabha Leak: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎపిసోడ్.. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికే ఎసరు పెట్టబోతోందా? ఏఐసీసీ విచారణ కమిటీ నివేదిక తర్వాత కాంగ్రెస్‌లో పెను మార్పులు ఉండబోతున్నాయా?

Telangana Cabinet Reshuffle 2026:  తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న  లీకుల రాజకీయం  ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఏఐసీసీ వేదికగా జరిగిన ఒక అనూహ్య పరిణామం.. చివరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథి, టీపీసీసీ  అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకే ఎసరు పెట్టే స్థాయికి చేరడం పొలిటికల్ సర్కిల్స్‌లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేసి బరిలోకి దించిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలే వెన్నుపోటు  కు పాల్పడ్డారనే పక్కా ఆధారాలు ఢిల్లీ పెద్దలకు చిక్కాయి. ఈ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంపై రాహుల్ గాంధీ అత్యంత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

రాహుల్‌కు అత్యంత నమ్మకమైన నేత మీనాక్షి నటరాజన్ 

 మీనాక్షి నటరాజన్ అంటే రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత నమ్మకమైన, విలువలతో కూడిన రాజకీయాలు చేసే సీనియర్ నాయకురాలిగా పేరుంది. ఆమె నామినేషన్‌ను తిరస్కరించడానికి బేస్‌గా మారిన తెలంగాణ పాత ప్రైవేట్ కంప్లైంట్  వివరాలను.. ఇక్కడి కాంగ్రెస్ నేతలే స్వయంగా బీజేపీకి లీక్ చేశారనే అంశంపై ఏఐసీసీ ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించింది. పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాల వల్లనే పార్టీ జాతీయ స్థాయిలో ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీకి ప్రాథమికంగానే ఒక స్పష్టత వచ్చేసింది. తన సొంత ఎంపికపైనే దెబ్బకొట్టిన ఈ అంతర్గత శత్రువులను క్షమించే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.  ఈ లీకేజీ వ్యవహారం కేవలం ఒక రాజ్యసభ సీటును కోల్పోవడం కాదు, రాహుల్ గాంధీ నాయకత్వానికే విసిరిన సవాల్‌గా ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. అందుకే, బాధ్యులపై చర్యలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ను రూట్ లెవెల్ నుండి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారు.
 
పీసీసీ చీఫే  బాధ్యత తీసుకోవాల్సి ఉందా?

ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ రాష్ట్ర అథారిటీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పాత్రపై తీవ్రమైన స్కృటినీ నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా రాష్ట్రంలో పార్టీ అంతర్గత సమాచారాన్ని, రహస్యాలను కాపాడటంలో, సొంత నేతలను కంట్రోల్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే బలమైన అభిప్రాయానికి హైకమాండ్ వచ్చింది. ఫలితంగా, తెలంగాణలో పార్టీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్‌ను పక్కన పెట్టి.. గ్రూపులను అణచగల ఒక అత్యంత సీనియర్, పవర్‌ఫుల్ లీడర్‌ను టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ బ్యాక్‌ఎండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

మంత్రివర్గం సహా మొత్తం ప్రక్షాళన

ఈ ప్రక్షాళన ప్రభావం కేవలం పార్టీ కమిటీలకే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరత్వంలోని కేబినెట్ పై కూడా తీవ్రంగా పడబోతోంది. ముఖ్యంగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒక డిప్యూటీ సీఎంల మధ్య సాగుతున్న భీకరమైన వర్గపోరు.. ఈ లీకేజీ వ్యవహారానికి ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని కొందరు మంత్రుల వెనుక ఉన్న ఒక బడా బిజినెస్ లాబీ.. కాంగ్రెస్‌లో ఉంటూనే సమాచారాన్ని బీజేపీకి చేరవేసే డబుల్ గేమ్ ఆడుతోందని, ఈ నటరాజన్ ఇష్యూలో కూడా ఆ వ్యాపారవేత్తల హస్తం స్పష్టంగా ఉందని నిఘా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన హెవీవెయిట్ మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం లేదా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా మారింది.

సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు

మరోవైపు, ఈ సంక్షోభాన్ని ఒక సామాజిక సమీకరణాల  మార్పుకు కూడా వేదికగా వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. చాలా కాలంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల  నుంచి వస్తున్న మంత్రివర్గ ప్రాతినిధ్య డిమాండ్‌ను నెరవేర్చడానికి.. ఈ లీకుల వ్యవహారంలో దొరికిపోయిన నాన్-పెర్ఫార్మర్ల మంత్రులను కేబినెట్ నుండి తప్పించనున్నారు. ఆ ఖాళీ అయ్యే స్థానాల్లో బీసీ నేతలకు  సీనియర్లకు చాన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సమయంలో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ఉండేందుకు  పార్టీని శాసించగల కొందరు అత్యంత పవర్‌ఫుల్ మంత్రులను ప్రస్తుతానికి టచ్ చేయకుండా.. కేవలం ‘వాచ్ లిస్ట్’ లో ఉంచి, తగిన సమయంలో వారి సంగతి తేల్చాలని ఏఐసీసీ భావిస్తోంది. మొత్తానికి, మధ్యప్రదేశ్‌లో తిరస్కరణకు గురైన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎపిసోడ్, ఊహించని విధంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక పెను రాజకీయ భూకంపానికి దారితీసింది.    

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget