అన్వేషించండి

Telangana Elections 2023 : బీజేపీ బీసీ సీఎం నినాదంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వద్ద కౌంటర్ లేదా ?

బీజేపీ బీసీ సీఎం నినాదంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాయా ? ఎందుకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ?


Telangana Elections 2023 :  తెలంగాణ బీజేపీ తాము గెలిస్తే  బీసీని సీఎం ను చేస్తామని ప్రకటించింది. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా అదే కారణం అని టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బీసీని సీఎంను చేయాలనుకుంటున్నామని అందుకే.. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని హైకమాండ్ ఆదేశించిందని చెబుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో బీసీ నేతను సీఎంను చేస్తామని భరోసా ఇస్తారు. ఆ బీసీ నేత ఎవరు అన్నది ప్రకటించినా .. ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతలు మత్రం బీసీ సీఎం నినాదంపై వీలైనంత వరకూ మౌనం పాటించే వ్యూహంలోనే ఉన్నాయి. ఎక్కువ స్పందిస్తే తమ పార్టీలో కూడా బీసీ ఉద్యమం వస్తుందని .. అదే జరిగితే  బీజేపీకి మేలు చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారు. 

బీఆర్ఎస్‌లో బీసీ సీఎం అనే నినానికి చాన్స్ లేదు !

భారత రాష్ట్ర సమితిప్రాంతీయ పార్టీ.  పూర్తిగా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంటుంది. ఆ కుటుంబం చేతి నుంచి పార్టీ జారిపోయే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అయ్యేది వారే. ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారు. తర్వాత కేటీఆర్ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అంతే కానీ..  బీఆర్ఎస్‌లో మరో నేత ముఖ్యంగా బీసీ నేత సీఎం అయ్యే అవకాశాలే లేవు. అందుకే బీసీ సీఎం నినాదాన్ని బీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకోలేదు. కుణం కాదు గుణం ముఖ్యమని అమిత్ షా బీసీ సీఎం ప్రకటన చేసినప్పుడు కేటీఆర్ స్పందించారు. తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు. దీనిపై ప్రజల్లో చర్చ జరిగితే తమకే నష్టమని అనుకుంటున్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో శ్రీనివాస్ గౌడ్ వంటి బీసీ నేతలతో కౌంటర్లు ఇప్పించారు కానీ..తర్వాత ఆ మాత్రం స్పందన కూడా ఇవ్వడం లేదు. 

కాంగ్రెస్ బీసీ నినాదం వినిపించడం కష్టం ! 

బీసీ సీఎం నినాదంపై కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రెండు అంటే రెండు శాతం ఓట్లు ఉన్న బీజేపీ బీసీని ఎలా సీఎంను చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అన్నారు. అంతే రాష్ట్ర నేతలు ఎవరూ బీసీ సీఎం గురించి మాట్లాడటం లేదు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా విరుచుకుపడినా సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్  ఉన్న పరిస్థితుల్లో.. ఆ పార్టీ గెలిస్తే.. రెడ్డి సామాజికవర్గ నేతలే సీఎం పదవి కోసం పోటీ పడతారు. ఈటల, బండి సంజయ్ తరహాలో కాంగ్రెస్ లో బలమైన బీసీ నేత లేరు. అదే సమయంలో..  రెడ్డి వర్గం కాదనుకుంటే.. దళిత వర్గాల నుంచి భట్టి విక్రమార్క రేసులో ఉంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ పెద్దగా బీసీ సీఎం నినాదంపై కల్పించుకోవడం లేదు. ఈ అంశంపై బీజేపీ చేసే ప్రచానికి ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే అంత మైనస్ జరుగుతుందని భావిస్తన్నారు. 

రెండు పార్టీల నిస్సహాయత బీజేపీకి ప్లస్ పాయింట్

బీసీ సీఎం నినాదం విషయంలో రెండు పార్టీలు కౌంటర్ ఇవ్వలేకపోవడంతో బీజేపీ దూకుడు పెంచుతోంది. ప్రధానితో ఆత్మగౌరవ సభను నిర్వహింప చేస్తున్నారు. రెడు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ప్రజల్లోకి  తీసుకెళ్లేందుకు ప్రణళికలు సిద్ధం చేసుకున్నారు. బీసీ సీఎం నినాదంతో వెళ్తే.. తమకు తిరుగు ఉండదన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆత్మరక్షణ ధోరణి బీజేపీకి ఓ అవకాశం కల్పిస్తోందని అనుకోవచ్చు. 

 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget